Sonali Bendre: ఇంద్ర షూటింగ్ సమయంలో గొడవ.. సోనాలి బింద్రేకు బి.గోపాల్ వార్నింగ్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ఇంద్ర ఒకటి. అప్పటి వరకు టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేశారు. బాలయ్య అయితే ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. తాను కూడా ఆ జోనర్ టచ్ చేయాలని భావించిన మెగాస్టార్ .. పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణలతో ‘‘ ఇంద్ర ’’ కథను రెడీ చేయించారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002, జూలై 24న విడుదలై ఎంతటి పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ఇంద్రుడు 19 ఏళ్ల‌ కిందే 17 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేశాడు. ఫుల్ రన్‌లో ఈ చిత్రం రూ.29 కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. సినిమా మొత్తం చూసి బయటకొచ్చాక రెండు విషయాలను ప్రేక్షకులు చాలా కాలం పాటు మర్చిపోలేకపోయారు. సినిమా చూసి బయటకొచ్చిన ప్రేక్షకుడికి…‘‘ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’’ అనే డైలాగ్, ‘‘దాయి దాయి దామ్మా పాటలో వీణ స్టెప్పు’’. ఈ రెండే గుర్తొస్తుండేవంటే అతిశయోక్తి కాదు. కాగా.. ఈ చిత్ర షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న కొన్ని విషయాలను దర్శకుడు బి గోపాల్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇంద్రలో హీరోయిన్‌గా చేసిన బాలీవుడ్ నటి సోనాలీ బింద్రె తొలుత పెద్ద గొడవ చేసిందట. హీరోయిన్ ఎంట్రీ సీన్‌లో ఆమె గంగా నదిలో మునగాల్సి వుంటుంది. అయితే అలా చేయడం తన వల్ల కాదని, మునిగితే మళ్లీ పైకి రాలేనని సోనాలి చెప్పిందట. సినిమాకు ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ అని ఎలాగోలా చేయమని బి గోపాల్ .. సోనాలిని బ్రతిమలాడారట. అయితే సమస్యను పరిష్కరించేందుకు ఆయన ఒక ఉపాయం ఆలోచించారట. వెంటనే సోనాలీతో ఇక్కడ మూడు కెమెరాలు వున్నాయని.. ఒకసారి మునిగితే చాలని చెప్పారట. కాదు కూడదు అంటే పేకప్ చెప్పేస్తానని ఆయన సున్నితంగా వార్నింగ్ ఇచ్చారట. ఆయన బలవంతం మీద సోనాలి ఆ సీన్‌ని ఎట్టకేలకు పూర్తి చేసిందట.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus