Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘బాహుబలి2’ లోగో ఆవిష్కరణ

‘బాహుబలి2’ లోగో ఆవిష్కరణ

  • October 1, 2016 / 05:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలి2’ లోగో ఆవిష్కరణ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, అనుష్క, తమన్నా,రాణా, రమ్యకృష్ణ, నాజర్‌ ప్రధాన తారాగణంగా, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని లు నిర్మాతలుగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘బాహుబలి2’. – ‘ది కన్‌క్లూజన్‌’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రభాస్‌, రాణా, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా….

నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మాట్లాడుతూ – ”షూటింగ్‌ ప్రకారం చూస్తే సినిమాలో ముఖ్య ఎపిసోడ్స్‌ అన్నీ పూర్తయ్యాయి. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ లో సినిమా చిత్రీకరణ అంతా పూర్తి చేసేస్తాం. కొన్ని సీన్స్‌, సాంగ్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్‌ 28న బాహుబలి2 విడుదల చేయబోతున్నాం. వచ్చే ఏడాది, అంటే జనవరిలో సినిమా ట్రైలర్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి” అన్నారు.

ప్రభాస్‌ మాట్లాడుతూ – ”బాహుబలి కామిక్‌ బుక్స్‌ విడుదల చేస్తున్నాం. అక్టోబర్‌ 1న ఆనిమేటెడ్ సిరీస్ టీజర్ విడుదల చేస్తాం. నా ఫ్యాన్స్‌, అందరూ ఎదురుచూస్తున్న ఫస్ట్‌ లుక్‌ను అక్టోబర్‌ 22న నా పుట్టినరోజుకు ఒక రోజు ముందు విడుదల చేస్తున్నాం. మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు సినిమా చేద్దాం అనుకున్నా. కానీ బాహుబలి లాంటి ఒక మహా సముద్రం మధ్యలో చిన్న చిన్న నదులను వదలటం కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే రెస్ట్ తీసుకున్నా. తరువాత సుజిత్ తో, రాధాకృష్ణ తో సినిమాలు ఓకే అయ్యాయి ” అన్నారు.

రాణా మాట్లాడుతూ – ”యూరి లో జరిగిన సైనిక శిబిరం పై దాడి ని ఖండిస్తూ, మన దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పిస్తున్న వీర జవాన్లకు వందనం. ఇప్పుడు నేనొక సినిమాల అభిమానిగా మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్‌లో చాలా ఇంగ్లిష్‌ సినిమాలు చూసేవాడిని. ఇండియానా జోన్స్‌ లాంటి వార్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమాలకు సంబంధించిన బుక్స్‌ ఎక్కువగా చదివేవాడిని. ఇండియన్‌ సినిమా ఎప్పటికైనా ఇలా ఉంటుందా? అని అనుకునేవాడిని. బాహుబలి సినిమా ప్రారంభంలో నేను రాజమౌళిగారిని కలిసినప్పుడు ఒక మ్యాప్‌ చూపించారు. మహిష్మతి అనే రాజ్యం, ఆ రాజు, అందులోని ప్రజలు, వారు వాడే వస్తువులు వంటివన్నీ నాకు సవివరంగా చెప్పారు. మహిష్మతి రాజ్యం అనేది రాజమౌళిగారు క్రియేట్‌ చేసిన ప్రపంచం, మహా వృక్షం. ఆ మహా వృక్షంలో చాలా కొమ్మలున్నాయి. అందులో ఒక కొమ్మ బాహుబలి సినిమా. ఇది కాకుండా టెలివిజన్‌ సీరీస్‌, కామిక్‌ బుక్స్‌, మెర్చండైజింగ్‌, వర్చువల్‌ రియాలిటీ వంటి ఎన్నో అంశాలు రాబోతున్నాయి. ఫైనెస్ట్‌ వార్‌ ఫిల్మ్‌ ఇన్‌ ద కంట్రీని తెరకెక్కించడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో తెలిసిందే. చాలా సినిమాలకి ప్రమోషన్‌ తాలూక టీ షర్ట్‌ లు వంటివి చూస్తుంటాం. యామజాన్‌ ప్రైమ్‌ నుంచి మా టీజర్‌ను అక్టోబర్‌ 1న విడుదల చేయనున్నాం. వరల్డ్‌ క్లాస్‌ యానిమేషన్‌ చూస్తున్నట్టు అనిపిస్తుంది” అన్నారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ – ”బాహుబలి టీమ్‌ కి అక్టోబర్‌ చాలా ఎగ్జైటింగ్ నెల. ఎందుకంటే బాహుబలికి సంబంధించిన రకరకాల విషయాలు అక్టోబర్‌లోనే విడుదలవుతాయి. బాహుబలి యానిమేటెడ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో రానుంది. దానికి సంబంధించిన టీజర్‌ అక్టోబర్‌ 1న విడుదలవుతుంది. అక్టోబర్‌ 5న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కి గుడ్‌ న్యూస్‌ చెప్తున్నాం. అదేంటనేది ఇప్పుడే చెప్పం. ఆ న్యూస్‌ తన అభిమానులకే కాదు మొత్తం సౌత్‌ ఇండియాకే గర్వకారణంగా ఉంటుంది. అలాంటి న్యూస్‌ అక్టోబర్‌ 5న రిలీజ్‌ కానుంది. ఇక బాహుబలిని ఒక మహావృక్షం గా తీసుకుంటే టీవీ సీరీస్‌, కామిక్స్‌, బుక్స్‌, గేమ్స్‌ అన్నీ హయ్యస్ట్‌ బడ్జెట్‌తో తీస్తున్నాం. బాహుబలితో వర్చువల్‌ రియాలిటీ ఎక్స్‌ పీరియెన్స్‌ అనే దాన్ని పరిచయం చేస్తున్నాం. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్‌తో అందరూ ఎగ్జయిట్‌ అవుతారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని 360 డిగ్రీస్‌లో ఎక్స్‌ పీరియన్స్‌ చేయగలిగే ఎక్స్పీరియన్స్ ఇది. ఈ రోజు మధ్యాహ్నం నేను తొలి టెస్ట్‌ చూశా. యూఎస్‌కి వెళ్లి వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీని గురించి తెలుసుకున్నా. రకరకాల కంపెనీల్లో వీడియోలు చూశా. నేను అక్కడ చూసిన క్వాలిటీ కన్నా, మేం తీసిన టెస్ట్‌ షార్ట్‌ చాలా మంచి క్వాలిటీతో ఉంది.

2D తెరమీద బొమ్మ చూస్తున్నట్టు కాకుండా మాహిష్మతి ప్రపంచంలోకి వెళ్లి , అక్కడ జరగుతున్న కథని అక్కడివారితో కలిసి చూస్తున్న అనుభూతిని కలుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే గూగుల్‌ కార్డ్‌ బోర్డ్‌ లో ఫోన్‌ పెట్టుకుని 360 డిగ్రీస్ లో చూస్తే వర్చ్యువల్ రియాలిటీ కనిపిస్తుంది. మరి కొంచెం మెరుగైన క్వాలిటీ కావాలంటే శామ్‌సంగ్‌ గేర్‌ వియర్‌ని పెట్టుకుని వర్చువల్‌ ప్రపంచాన్ని చూడొచ్చు. ఏ ఫోన్‌ ఉంటే ఆ ఫోన్ కి పనికొచ్చే VR గ్లాస్సెస్ ని వాడి చూడొచ్చు.వీటి ధర రూ.100 నుంచి రూ.3000 ఉండొచ్చు.అత్యుత్తమ వర్చువల్‌ రియాలిటీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం రూ.2లక్షల ఖర్చుతో ఆక్యులస్‌ రిఫ్ట్‌ గానీ, వైవ్‌గానీ దొరుకుతాయి.

మేం చేసే బాహుబలి VR ఎక్స్‌ పీరియన్స్‌ ఆ గ్లాసెస్‌ కోసం చేస్తున్నాం. ఇవి అందరికీ అందుబాటు లో లేవు కాబట్టి 200, 300 థియేటర్లలో వాటిని స్టాల్స్‌ పెట్టి మేమే ఇస్తాం. దానితో ఆడియెన్స్‌ ఈ ఎక్స్‌ పీరియన్స్‌ ని పొందొచ్చు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటిది తొలిసారి బాహుబలి సినిమాలకే జరుగుతుంది. దీని కోసం మేం రూ.25 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నాం. బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్‌ రియాలిటీ ఎక్స్‌ పీరియన్స్‌ను విడుదల చేస్తాం. దాంతో పాటు మేకింగ్‌ వీడియోస్‌ని వర్చువల్‌ రియాలిటీలో చేస్తున్నాం. డైరక్ట్‌గా కావాలంటే ఫోన్‌లో ప్యాన్‌ చేసుకుని, గూగుల్‌ కార్డ్‌ బోర్డ్‌లోనూ చూడొచ్చు. మేకింగ్‌ వీడియోలను కూడా హై క్వాలిటీ VR లో చేస్తున్నాం. వర్చువల్‌ రియాలిటీలో రూపొందించిన తొలి మేకింగ్‌ వీడియో ప్రభాస్‌ పుట్టినరోజుకి విడుదల చేయనున్నాం” అన్నారు.

తర్వాత మీడియా అడిగి ప్రశ్నలకు రాజమౌళి సమాధానమిచ్చారు….

అక్టోర్‌ 5న ప్రభాస్‌కు సంబంధించిన న్యూస్‌ ఏంటి? ప్రభాస్‌కు ఏమైనా ప్రఖ్యాత అవార్డు వచ్చిందా….? – అవార్డులకు సంబంధించిన న్యూస్‌ కాదండీ. మాకు ఆ న్యూస్‌ వచ్చినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో, మీరు అవ్వాలి. 5 న అందరికీ తెలుస్తుంది.

బాహుబలి 2 హైలైట్స్‌ చెప్పండి? – ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు సంబంధించిన విషయాలను ముందుగానే ఓ పద్ధతి ప్రకారం రవీల్‌ చేసుకుంటూ వచ్చాను. అయితే బాహుబలికి సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పకూడదు, సినిమాలోనే చూడాలనేది నా అభిప్రాయం.

బాహుబలి2లో తమన్నా మీద సాంగ్స్‌ ఉంటాయా? – సెకండాఫ్‌లో తమన్నా ఉంటుంది. కానీ ఆమె మీద పాటలు లేవు. అనుష్క ఇందులో హీరోయిన్‌. అనుష్క మీదనే పాటలు ఉంటాయి.

యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యిందా ? – సినిమా లో కీలకమైన క్లైమాక్స్‌ అయిపోయింది. గ్రాఫిక్స్‌ విషయంలో, మనుషుల విషయంలో ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలిగాం. రెండున్నర నెలలు సమయం పట్టింది. ఎడిటింగ్‌ చేసి గ్రాఫిక్స్‌ చేశాం.

షూటింగ్‌లో ఇంకా ఏం చేయాల్సి ఉన్నాయి? – రెండు పాటలు, చిన్న ప్యాచ్‌ వర్క్‌, ఒక చిన్న యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంది.

ప్రభాస్‌, రాణా లను ఎప్పుడు విడిచి పెడతారు? – డిసెంబర్‌ నెలలో రెండు వారాల్లో వారికి సంబంధించిన షూటింగ్‌ పూర్తవుతుంది. దాంతో ప్రభాస్‌,రాణా యే కాదు, అందరూ ఆర్టిస్ట్‌లు రిలీజ్‌ అవుతారు.

బాహుబలి పార్ట్‌ 3 ఉంటుందా? – బాహుబలి అనే మహావృక్షం నుంచి చాలా సినిమాలు వస్తాయి. సినిమా అనేది కొమ్మ మాత్రమే. బాహుబలి పార్ట్‌ 3 అనేది ఆన్‌ ద కార్డ్స్‌. అది ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేను.

వర్చువల్‌ రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్‌తో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తున్నారా? – నేషనల్‌ ఆడియన్స్‌నే నేను టార్గెట్‌ చేశాను. వర్చువల్‌ రియాలిటీకి సంబంధించి ఎ.ఎం.డి వాళ్లతో కోలాబోరేట్ అయ్యాం. వాళ్లు నాణ్యతతో కూడిన లెటెస్ట్‌ కెమెరాలు, రిలేటెడ్‌ టెక్నాలజీ, దానికి సంబంధించిన స్టిచింగ్‌, హై క్వాలిటీ 360 డిగ్రీ ఇమేజ్‌ని తీసుకురావడానికి హెల్ప్‌ చేస్తున్నారు. లాస్‌ ఏంజెల్స్‌ లో గ్రాఫిక్స్‌ కంపెనీల్లో దానికి సంబంధించిన సీజీ వర్క్‌ జరుగుతోంది.

వర్చువల్‌ రియాలిటీని చేయడానికి ఇన్స్‌ పిరేషన్‌ ఎక్కడిది? ఈ టెక్నాలజీ కేవలం వార్‌ సీక్వెన్స్‌ కేనా? – ఇది చాలా ఫ్లాట్‌ఫార్మ్స్‌ కి రీచ్‌ అవుతుందని అనుకుంటున్నాం. సెట్‌ ఇన్‌ ద వార్‌. బట్‌ వార్‌ మాత్రమే ఉండదు. సినిమా మొత్తానికి ఉంటుంది.

బాహుబలి కి టైమ్‌ ఫ్రేమ్‌ ఏమన్నా పెట్టుకున్నారా? – ఫరెవర్‌. నాకు బాహుబలిని వదలాలని లేదు. వెస్ట్‌ లో ఫ్రాంచైసిస్‌ అనేది ఇంతే. స్టార్ వార్స్ వంటి సినిమాలు చుడండి. ఎవరైతే క్రియేట్‌ చేశారో వాళ్లు పోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమా కోసం ఆర్టిస్టులు పెట్టిన హార్డ్‌ వర్క్‌ సినిమా అయ్యాక ఆగిపోవాలని లేదు. కంటిన్యూ కావాలని ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali 2 Movie
  • #baahubali animation series
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

trending news

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

49 mins ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

21 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

23 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version