బాహుబలి (Baahubali) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి నిఖిల్ దేవదుల (Nikhil Devadula) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నిఖిల్ దేవదుల ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమా సమయంలో 3 యూనిట్స్ నడిచాయని ఆయన కామెంట్లు చేశారు. ఇంపార్టెంట్ సీన్ ఉన్న చోట రాజమౌళి (S. S. Rajamouli) ఉండేవారని నిఖిల్ పేర్కొన్నారు. ఒక సినిమా షూట్ సమయంలో జీవిత చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన తెలిపారు.
ఇంట్లో దెబ్బలు బాగా పడ్డాయని మమ్మీ, డాడీ ఇద్దరూ చిన్నప్పుడు కొట్టేవారని నిఖిల్ దేవదుల వెల్లడించారు. మా ఇల్లు పెద్ద ఫంక్షన్ హాల్ లా ఉంటుందని మా ఇంట్లో ఎవరూ అరవరని ఆయన కామెంట్లు చేశారు. సినిమా కోసం బరువు తగ్గానని ఆయన చెప్పుకొచ్చారు. మెయిన్ లీడ్ సినిమాలు చేయనని నేను చెప్పటం లేదని నిఖిల్ వెల్లడించారు. నేను ఫైట్లు చేసి డైలాగ్స్ చెబితే జనం చూడరని నిఖిల్ అన్నారు.
జనాలకు సినిమా అంటే ప్రతిదీ తెలిసిపోయేదని ప్రేక్షకులు లాజిక్స్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. కమర్షియల్ సినిమాలు చేసినా స్టోరీ ఉండాలని నిఖిల్ పేర్కొన్నారు. 1 నేనొక్కడినే (1: Nenokkadine) సినిమా కోసం ఒక వారం అడిషన్స్ కు వెళ్లానని ఆయన తెలిపారు. ఆ సినిమాకు డేట్స్ ఇచ్చి క్యాస్టూమ్స్ కొలతలు తీసుకుని ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదని నిఖిల్ వెల్లడించారు. ఆ సినిమాలో గౌతమ్ నటించిన పాత్రలో నేను నటించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఆగడు సినిమాలో మహేష్ (Mahesh Babu) చిన్నప్పటి పాత్రలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని నిఖిల్ దేవదుల అన్నారు. రెండుసార్లు మహేష్ మూవీలో ఛాన్స్ మిస్సైందని నిఖిల్ తెలిపారు. ఒక సినిమా కోసం గుండు చేయించుకోవడం వల్ల మరో సినిమా ఛాన్స్ పోయిందని నిఖిల్ పేర్కొన్నారు. నిఖిల్ దేవదుల రాబోయే రోజుల్లో హీరోగా కూడా బిజీ కానున్నారని తెలుస్తోంది. బాహుబలి చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపును సొంతం చేసుకున్న నిఖిల్ సినిమాలలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.