తారకరత్న (Taraka Ratna) భార్య అలేఖ్యా రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలేఖ్యారెడ్డి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. అటు బాలయ్య, ఇటు విజయసాయిరెడ్డి అలేఖ్యకు బంధువులే కావడం వీళ్లిద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉండటంతో అలేఖ్యారెడ్డి ఎవరికి మద్దతు ఇస్తారనే చర్చ కూడా జోరుగా జరిగింది. అయితే ఆ సందేహాలకు చెక్ పెట్టే విధంగా అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు.
2024 ఎన్నికలలో నా మద్దతు బాలకృష్ణ (Balakrishna) మామయ్యకే అని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్నానని నాకు తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని అలేఖ్యారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు దానిపై నేను సరైన నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నా మద్దతు, ప్రేమ నా ఫ్యామిలీ వైపు ఉంటాయని అలేఖ్య వెల్లడించారు. తారకరత్న టీడీపీ గెలుపు కోసమే కృషి చేసిన నేపథ్యంలో అలేఖ్య ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
భర్త ఇష్టాలను సైతం అలేఖ్య తన ఇష్టాలుగా మార్చుకున్నారని భర్తకు ఆమె ఇచ్చిన మాట వల్లే బాలయ్యకు అనుకూలంగా ప్రకటన చేసి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. తారకరత్న మరణం తర్వాత ఆ కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా బాలయ్య తన వంతు సహాయం చేశారు. బాలయ్యకు మద్దతు ఇవ్వడం ద్వారా రుణం తీర్చుకునే అవకాశం రావడంతో అలేఖ్య బాలయ్యకు మద్దతు ప్రకటించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అలేఖ్యారెడ్డి భవిష్యత్తులో ఏపీ రాజకీయాలపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం పిల్లల కెరీర్ పై అలేఖ్యారెడ్డి ఫోకస్ పెడుతూ వాళ్లను ప్రయోజకులను చేయాలని భావిస్తున్నారు. అలేఖ్యారెడ్డి మంచి అమ్మ అని మరి కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.