దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన వెండితెర కళాఖండం బాహుబలి కంక్లూజన్ దేశ చిత్ర పరిశ్రమలకు స్ఫూర్తిగా నిలిచాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం గత ఏడాది రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు అద్భుతంగా నటించిన ఈ సినిమా రోజుకో రికార్డు చొప్పున బద్దలు కొడుతూ తెలుగు సినిమాలకు రారాజుగా నిలిచింది. మూడు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీ చైనాలో రేపు(మే 4 ) రిలీజ్ కావడానికి సిద్ధమైంది.
చైనాలో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్న ఇండియన్ సినిమాగా ఇప్పటికే రికార్డ్ సృష్టించింది. అలాగే ఈ చిత్రాన్ని 7000లకు పైగా స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. ఇన్ని థియేటర్లలో రిలీజ్ కావడం మరో రికార్డు. ఇక 2.5 లక్షల డాలర్ల ప్రీ రిలీజ్ జరిగింది. ఇలా రిలీజ్ కి ముందే చైనాలో రికార్డులను సృష్టించిన ఈ మూవీ రేపు ఓపెనింగ్స్, కలెక్షన్లతో కొత్త రికార్డును నెలకొల్పడం ఖాయం. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దంగల్ పేరిట ఉన్న రికార్డులను చైనా కలక్షన్స్ తో బాహుబలి 2 బద్దలు కొట్టి.. నంబర్ వన్ కిరీటాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని చిత్ర బృందం ధీమాగా ఉంది.