Baahubali Crown of Blood: ‘బాహుబలి’ బొమ్మల సినిమా… ప్రచారం కోసం కొత్త స్టంట్‌

‘బాహుబలి’ (Baahubali) సిరీస్‌ సినిమాలు సినీ ప్రియులను ఎంతగా అలరించాయో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడో ‘బాహుబలి’ వస్తే చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మూడో పార్టు వచ్చే అవకాశంలేదు. అయితే ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ పేరుతో ఓ యానిమేషన్‌ సినిమా రూపొందించారు. మే 17 నుండి ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. వారానికొక ఎపిసోడ్‌ చొప్పున అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రచారానికి టీమ్‌ ఈటీవీ విన్‌ హిట్‌ సిరీస్‌ ‘#90s’ (90’s – A Middle-Class Biopic) కాన్సెప్ట్‌ను వాడుకుంటోంది.

ఆ సిరీస్‌ ఫస్ట్‌ టైమ్‌ అలా చేసింది అని చెప్పం కానీ.. రీసెంట్‌ సినిమా కాబట్టి ఆ రిఫరెన్స్‌ వాడాం అంతే. ఆ సిరీస్‌ను ఈటీవీ విన్‌ టీమ్‌ ‘తొలి ఎపిసోడ్‌’ ఫ్రీ అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లింది. భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌’ సిరీస్‌ తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా చూసే అవకాశాన్ని హాట్‌ స్టార్‌ కల్పించింది. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది కూడా.

ఇక మిగిలిన ఎపిసోడ్‌లను చూడాలంటే హాట్‌స్టార్‌కు లాగిన్‌ అవ్వాల్సిందే. అంటే పేమెంట్ చేయాల్సిందే. మరి #90s తరహా ప్రచారం సిరీస్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ‘బాహుబలి’ యానిమేటెడ్‌ సిరీస్‌కు జీవన్‌ జె.కాంగ్‌, నవీన్‌ జాన్‌ దర్శకత్వం వహించారు. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియాతో కలిసి రాజమౌళి (S. S. Rajamouli)  , శరద్‌ దేవరాజన్‌, శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) నిర్మించారు. ఈ సిరీస్‌ ‘బాహుబలి’కి సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ కాదు.

ఆ రెండు భాగాలకు మధ్యలో జరిగే కథ ఇది. అంతేకాదు ‘బాహుబలి’ ప్రపంచాన్ని మరింత విస్తరింపజేసే ప్లాన్స్‌ కూడా ఉన్నాయట. ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ అనేది తమ ఆలోచనలకు స్టార్టింగ్‌ అని, ఇంకా ఇలాంటి మరికొన్ని ఆసక్తికర ప్లాన్స్ ఉన్నాయని టీమ్‌ అంటోంది. అవేంటి అనేది త్వరలో చెబుతాం అంటోంది. ఇప్పటికైతే ఫస్ట్ ఎపిసోడ్‌ అయితే చూసి ఎంజాయ్‌ చేసేయండి మరి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus