Vishwak Sen: ‘బేబీ’ కాంట్రవర్సీ.. అంత ఆటిట్యూడ్ పనికిరాదు అంటున్న బాహుబలి నిర్మాత

విశ్వక్ సేన్ ఉన్నచోటున ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉంటాడు. మరీ ముఖ్యంగా తనకి ఆటిట్యూడ్ ఉందని, నా ఆటిట్యూడ్ ఇంతే అని చెప్పుకోవడం అతనికి చాలా ఇష్టం. అయితే అతని సినిమాలు కంటెంట్ పరంగా బాగుంటాయి. కానీ భారీ సక్సెస్ అందుకున్న సినిమాలు మాత్రం ‘హిట్’ ‘దాస్ క ధమ్కీ’ మాత్రమే. ప్రస్తుతం ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వంటి పెద్ద బ్యానర్లో సినిమాలు చేస్తున్నాడు. సరే ఇక అసలు మేటర్లోకి వచ్చేద్దాం.

ఇటీవల ‘బేబీ’ అనే సినిమా వచ్చింది. అది సూపర్ సక్సెస్ సాధించింది. సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ముందుగా ఈ కథని విశ్వక్ సేన్ కి వినిపించాలని అతను భావించాడట. అయితే విశ్వక్ సేన్.. సాయి రాజేష్ చెప్పిన కథ వినడానికి ఇష్టపడలేదు.ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో సాయి రాజేష్ ..’ ‘హృదయ కాలేయం’ ‘కొబ్బరి మట్ట’ వంటి స్పూఫ్ సినిమాలు తీశాడు కాబట్టి… అలాంటి చీప్ డైరెక్టర్ల కథలు నేను వినను’ అంటూ ఓ హీరో అన్నట్టు చెప్పుకొచ్చాడు.

అటు తర్వాత (Vishwak Sen) విశ్వక్ సేన్ ‘నేను గంట సేపు కథ విని బాలేదు అనే కంటే ముందే చెప్పేస్తే టైం వేస్ట్ అవ్వదు కదా. అయినా సక్సెస్ వస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఇంకొకరిని కించపరచడమేంటి?’ అంటూ కామెంట్లు చేశాడు. విశ్వక్ కామెంట్లకి పరోక్షంగా బాహుబలి నిర్మాత చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ” విజయం అనేది ఒక్కోసారి తలకు ఎక్కుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

ఇటీవల ఓ యంగ్ హీరోకి తన యాటిట్యూడ్ వల్ల ఒక మంచి సక్సెస్ వచ్చింది. అయితే అతనికి కథ చెబుతాను అంటూ ఒక డెబ్యూ డైరెక్టర్ అడిగితే.. కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించాడు. తన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇలాంటి ఆటిట్యూడ్ సరైనది కాదు. అతను ఎప్పటికి తెలుసుకుంటాడో ఏమో” అంటూ శోభు ట్వీట్ చేశాడు. అటు తర్వాత ఆ ట్వీట్ ను అతను డిలీట్ చేయడం కూడా జరిగింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus