‘ఎన్టీఆర్’ ఫ్యాన్స్ కు “బాహుబలి” షాక్!!!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సంధించిన విషువల్ వండర్ ‘బాహుబలి’ సినిమా టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ అయ్యి రికార్డుల పరంపరని కొనసాగించింది. అంతేకాకుండా విషువల్ ఎఫెక్ట్స్ తో  హాలీవుడ్ స్థాయిలో ఒక తెలుగు సినిమా రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా చూసిన వాళ్ళంతా జక్కన్న టెక్నికల్ టాలెంట్ కి ఫిదా అయిపోయారు. ఇక ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాకు భారతదేశ జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా లభించడం విశేషం. ఇదిలా ఉంటే ‘బాహుబలి-దిబిగినింగ్’ కధ విషయం పక్కన పెట్టి, ‘బాహుబలి-దిఎండింగ్’ పై కన్నేశారు మన ప్రేక్షకు దేవుళ్ళు. ఈ సినిమా రెండో భాగంపై రకరకాల కధనాలు బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈ సినిమా పాత్రల విషయంపై అనేక రూమర్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తున్నాయి.

బాహుబలి పార్ట్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్  జయదేవ్ రానా గా  కనిపించానున్నాడని  గత రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తెలుగులో ఎన్టీఆర్ జయదేవ్ గా నటిస్తే , తమిళ ,హిందీ భాషలలో మాత్రం జయదేవ్ రానా పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇదంతా నిజమే అనుకున్న అభిమానులకు ఈ చిత్రం యూనిట్ షాక్ ఇచ్చింది…అలాంటి ఏమీలేదని ఇవన్నీ ఒట్టి పుకార్లు అని కొట్టి పడేసింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు అని. మరో పక్క సూర్య కూడా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్  సింగం 3 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అని, ఈ వార్తలు అన్నీ ట్రాష్ అని తేల్చి పడేశారు..పాపం అభిమానులు!!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus