Vijayendra Prasad: ‘సీత’ కథను సిద్ధం చేసిన విజయేంద్రప్రసాద్!

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో రామాయణం కథతో చాలా సినిమాలొచ్చాయి.

‘ఆదిపురుష్’ సినిమా లేటెస్ట్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా మరో సినిమా వస్తుందని తెలుస్తోంది. దీనికి కథ సిద్ధం చేసింది విజయేంద్రప్రసాద్ కావడం విశేషం. ఆ సినిమా పేరు ‘సీత’. రామాయణ గాథను సీత కోణంలో చెప్పే సినిమా ఇది. విజయేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో ఈ కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అలౌకిక దేశాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సీత పాత్ర కోసం అలియాభట్, లేదా కరీనా కపూర్ లను తీసుకోవాలని చూస్తున్నారు.

రావణుడి పాత్ర కోసం మాత్రం రణవీర్ సింగ్ ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. మరి ‘ఆదిపురుష్’కు పోటీగా ఈ సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి!

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus