దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అపూర్వ సృష్టి “బాహుబలి : బిగినింగ్” రిలీజ్ తర్వాత రికార్డులను నెలకొల్పగా… ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ విడుదలకు ముందే చరిత్రను లిఖిస్తోంది. 250 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నిర్మాతలకు లాభాలను అందించింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా రిలీజ్ కి ముందే ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అది ఎలాగంటారా? డిస్ట్రిబ్యూటర్ లకు టికెట్స్ అమ్ముడు పోయిన తర్వాత దానిని బట్టి లాభాలు వస్తాయి. బాహుబలికి మాత్రం షో మొత్తాన్నే అమ్మేస్తున్నారు.టికెట్ ధర, హాల్ నిండడం వంటివి అవసరం లేదు. ఇలా హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లకు ఈ బాహుబలి 2 ని షో రూపంలో అమ్మేస్తున్నట్లు తెలిసింది.
నైజాం(తెలంగాణ) ఏరియా హక్కులను ఏషియన్ ఎంటర్ ప్రయిజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 50 కోట్లకు సొంతం చేసుకున్నారు. అంతమొత్తం వెనక్కి రావాలంటే ఇలా చేయక తప్పదని ట్రేడ్ వర్గాల వారు సమర్థిస్తున్నారు. రేట్లు ఎక్కువగా ఉన్నా బాహుబలి అభిమానులు అభ్యంతరం చెప్పరని భావిస్తున్నారు. ఇలా జక్కన్న సినిమా కొత్త డిస్ట్రిబ్యూటర్లకు కూడా విడుదలకు ముందే లాభాలను అందిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.