ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి2’ విడుదలయ్యి ఈరోజుతో 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2017 ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల అయ్యింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ఇది.దేశ విదేశాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి అంటే.. అది ఈ సినిమా వల్లనే అని చెప్పాలి. ఇక ఈ చిత్రం విడుదలయ్యి 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సోషల్ మీడియాలో ‘#4YearsForWorldOfBaahubali2 , #4YearsForIndianEpicBB2, #4YearsForBahubali2’ వంటి హ్యాష్ ట్యాగ్ లతో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
మరి ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 66.90 cr |
సీడెడ్ | 34.78 cr |
ఉత్తరాంధ్ర | 26.47 cr |
ఈస్ట్ | 17.04 cr |
వెస్ట్ | 12.31 cr |
గుంటూరు | 18.01 cr |
కృష్ణా | 14.10 cr |
నెల్లూరు | 8.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 197.65 cr |
కర్ణాటక | 62.00 cr |
తమిళ నాడు | 81.00 cr |
కేరళ | 32.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 281.05 cr |
ఓవర్సీస్ | 160.28 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 814.10 cr |
‘బాహుబలి2’ కి జరిగిన థియేట్రికల్ బిజినెస్ రూ.350 కోట్లు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 814.10 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 1750 కోట్లను కొల్లగొట్టింది. మొత్తానికి ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీగా రూ.464.10 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది. ఇండియన్ సినిమాల్లో మొదటి 1000 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టిన సినిమా కూడా ‘బాహుబలి2’ నే కావడం విశేషం.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!