టాలీవుడ్ ప్రముఖ నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బాబు మోహన్ బీజేపీ వైఖరి విషయంలో హర్ట్ కావడంతో పాటు తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటానని అన్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని బీజేపీకి కూడా తాను దూరమేనని బాబు మోహన్ వెల్లడించడం గమనార్హం. బీజేపీ మొదటి విడత అభ్యర్థులను ప్రకటించగా బాబు మోహన్ కు టికెట్ ఇవ్వరని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
బాబు మోహన్ వయస్సు 71 సంవత్సరాలు కాగా గత ఎన్నికల్లో అందోలు నుంచి బాబు మోహన్ పోటీ చేసినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. బీజేపీ అధిష్టానం బాబు మోహన్ తనయుడికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ టికెట్ ఇవ్వని విషయాన్ని బీజేపీ చెప్పొచ్చు కదా అని అన్నారు. తన కొడుకుకు టికెట్ ఇస్తామని చెప్పడం ద్వారా తండ్రీకొడుకుల మధ్య విబేధాలు సృష్టించాలని అనుకుంటున్నారా అంటూ బాబు మోహన్ ప్రశ్నించారు.
తానంటే ఇప్పటికీ ప్రజల్లో ఇమేజ్ ఉందని రోడ్డుపై నిలిస్తే నిమిషాల వ్యవధిలో వందల మంది గుమికూడతారని అయన చెప్పుకొచ్చారు. టికెట్లను ఖరారు చేసేవాళ్లు ఈ విషయాలను తెలుసుకోవాలని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. అభ్యర్థుల ఎంపికలో మొదటి, రెండో లిస్ట్ లు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. టికెట్ తనకు ఇస్తారో కొడుకుకు ఇస్తారో చెప్పకపోవడం ఆవేదన కలిగిస్తోందని బాబు మోహన్ వెల్లడించారు.
బాబు మోహన్ (Babu Mohan) చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బాబు మోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. బాబు మోహన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!