Baby: ‘బేబీ’ రీమేక్.. హిందీ జోడి సెట్టయ్యింది!

‘బేబీ’ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న సాయి రాజేష్, SKN కాంబో ఇప్పుడు హిందీ మార్కెట్‌ వైపు దృష్టి పెట్టారు. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, యూత్‌ను బాగా కనెక్ట్ చేస్తూ పెద్ద హిట్‌గా నిలిచింది. 100 కోట్ల కలెక్షన్స్‌ మార్క్‌ను దాటడం విశేషం. ఈ సినిమా విజయంతో బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని ముందుకెళ్లిన మేకర్స్, ఎట్టకేలకు హీరో, హీరోయిన్ పాత్రలకు తగిన జోడీని ఖరారు చేసినట్లు సమాచారం.

Baby

హీరోగా ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బబిల్ ఖాన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. బబిల్ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్‌లో తన ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తుండగా, ఈ సినిమా అతనికి మంచి ఛాన్స్ అవుతుందని అంటున్నారు. హీరోయిన్గా తొలుత ఖుషి కపూర్ పేరు వినిపించినా, చివరికి కృతి శెట్టి పేరు ఫైనల్ కావొచ్చని టాక్. తెలుగు సినిమాలో మంచి పేరు సంపాదించిన కృతి, బాలీవుడ్‌కి ఇదే ఆరంగేట్రం కావొచ్చు.

ఇక హిందీ వెర్షన్‌కి సాయి రాజేష్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. SKN ప్రొడక్షన్ హౌస్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమవుతున్నట్లు సమాచారం. తెలుగు వెర్షన్‌లో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీకు మెజారిటీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అదే హిందీ వెర్షన్‌లో ఆ మ్యాజిక్‌ను మళ్ళీ సృష్టించగలరా అనే ఆసక్తి పెరిగింది.

ఈ రీమేక్‌కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్‌ కూడా రానుందని తెలుస్తోంది. ‘బేబీ’ హిందీ వెర్షన్‌తో దర్శకుడు సాయి రాజేష్ బాలీవుడ్‌కి అడుగు పెట్టడం, కొత్త హీరోహీరోయిన్ల కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. తెలుగులో విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ కథ, యూత్‌ను బాగా కనెక్ట్ చేస్తుంది. అయితే, హిందీ ఆడియన్స్‌కు అదే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే, నటీనటుల ఎంపిక, కథనంలోని నేటివిటీ అంశాలను జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags