Bro Movie: బ్రో దెబ్బకు బేబీకి కష్టమేనా.. ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ లేదా?

ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ఏదనే ప్రశ్నకు బేబీ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో మరీ భారీ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఈ సినిమా మాత్రం అంచనాలను మించి మెప్పించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. ఈ సినిమా నిన్నటివరకు భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే పవన్, సాయితేజ్ కాంబో మూవీ బ్రో రిలీజ్ తో బేబీ లెక్కలు మారిపోయాయి.

కొన్ని ప్రముఖ థియేటర్లలో బేబీ మూవీ బుకింగ్స్ అదుర్స్ అనే విధంగా ఉండగా మిగతా థియేటర్లలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ఇకపై బేబీ మూవీ భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మరోవైపు బ్రో మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. బ్రో సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది.

పవన్ ఫ్యాన్స్ బ్రో సినిమాను మళ్లీ మళ్లీ చూస్తామని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బ్రో సినిమాకు రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. బ్రో సినిమా కమర్షియల్ గా భారీ స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్రో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల మార్కును సులువుగా సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

బ్రో సినిమాకు (Bro Movie) పాజిటివ్ టాక్ రావడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బ్రో సినిమాకు బీజీఎం హైలెట్ గా నిలిచిందని చెబుతున్నారు. చిన్నచిన్న నెగిటివ్స్ ఉన్నా బ్రో సినిమాలో పవన్ మేనరిజమ్స్ ఆ నెగిటివ్స్ మరిచిపోవడానికి కారణమవుతున్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బ్రో మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus