Naga Chaitanya: నాగచైతన్య సినిమా విషయంలో చందు మొండేటి కీలక మార్పు.. రీజన్‌ ఏంటో?

గంగపుత్రులు.. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ ట్రెండ్‌ ఎక్కువగా నడుస్తోంది. స్టార్‌ హీరోలు చాలామంది ఈ పాత్రలో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి సినిమాలకు విజయాల శాతం కూడా బాగానే ఉండటం గమనార్హం. ‘ఉప్పెన’, ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ‘దేవర’ సిద్ధమవుతుండగా.. ఇప్పుడు మరో హీరో కూడా అదే పని చేయబోతున్నారు. ఇంకా ఈ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్‌ కాలేదు కానీ.. సినిమా బ్యాగ్రౌండ్‌ గురించి చెప్పడంతో ఈ క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఏరియా మారింది అంటున్నారు.

(Naga Chaitanya) నాగ్ చైతన్య – చందు మొండేటి కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్‌ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని వార్తలొస్తున్న ఈ సినిమాకు ప్రొడక్షన్‌ హౌస్‌ భారీ బడ్జెట్ పెడుతోంది అంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే ఇదే భారీ బడ్జెట్‌ సినిమా అని కూడా చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఫైనల్‌ అవుతున్న క్రమంలో సినిమా బ్యాగ్రౌండ్‌ మారింది అని సమాచారం. అంటే కథ మారలేదు కానీ.. ఏరియా మారింది అని సమాచారం.

తొలుత ఈ సినిమాను గుజరాత్‌ ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తారని వార్తలొచ్చాయి. ఈ మేరకు ఇండియా బోర్డర్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని శ్రీకాకుళం జిల్లాకు మార్చారని చెబుతున్నారు. ఈ మేరకు కథలో చిన్నపాటి మార్పులు జరిగాయి అని చెబుతున్నారు. అయితే ఎందుకు మార్చారు అనే విషయంలో క్లారిటీ లేదు. సినిమా ఓపెనింగ్‌ సమయంలో ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అని చెబుతున్నారు.

ఈ సినిమా పూర్తి స్థాయి లవ్ స్టోరీగా కాకుండా ఓ లవర్ ఎమోషనల్ జర్నీలా ఉంటుంది అని సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘సవ్యసాచి’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సరైన ఫలితం దక్కపోయినా.. కొత్త తరహా కాన్సెప్ట్‌ అనే పేరు మాత్రం సంపాదించింది. మరి ఈ సినిమాతో ఏం సాధిస్తారో చూడాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus