నిహారిక, శిరీష్ లకు మొహం చాటేస్తున్న బయ్యర్లు..!

మెగాడాటర్ గా టాలీవుడ్ కి.. మూడేళ్ళ క్రితమే ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆరంభంలోనే చాలా విమర్శలు ఎదుర్కొంది ఈ అమ్మడు. మెగాభిమానులు ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయొద్దని.. నాగబాబుని కూడా కోరారట. అయినప్పటికీ నీహారిక ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా హిట్టవ్వక పోగా.. నిహారిక కి పెద్దగా అవకాశాలు రావడానికి కూడా ఉపయోగపడలేదు. దీంతో ఎప్పుడో షెడ్డుకెల్లిపోయిన సుమంత్ అశ్విన్ తో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సొంతంగా ఓ రేంజ్లో ప్రమోషన్ చేసుకుంది. అయినప్పటికీ హిట్టు మాత్రం సాధించలేకపోయింది.

ఇక తాజాగా నిహారికా నటిస్తున్న ‘సూర్యకాంతం’ చిత్ర పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యింది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం చాలా కష్టమయ్యింది. టీజ‌ర్ చూడ్డానికి ‘వెబ్ సిరీస్’ మాదిరిగా ఉండడంతో.. ఈ చిత్రాన్ని కొనుక్కోవడానికి బయ్యర్లు ముందుకు రాకపోవడం గమనార్హం. మొదట ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాల‌ని భావించినప్పటికీ.. ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం పూర్తవ్వలేదు. ఈ క్రమంలో ‘నిర్వాణ సినిమాస్’ సంస్థ సొంతంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మెగా కాంపౌండ్ లో అల్లు శిరీష్ కి కూడా దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడింది. శిరీష్ కెరీర్లో ఓ రెండు హిట్లున్నా… తన తాజా చిత్రం ‘ఎబిసిడి’ చిత్రానికి బయ్యర్లు ముందుకు రావట్లేదట. దీంతో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ‌వుతుందో తెలియ‌ని పరిస్థితి ఏర్పడింది. మొదట ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8 న విడుదల చేయాలనుకున్నారు కానీ.. తరువాత మార్చి 1కి మార్చారని చెప్పుకొచ్చారు ఇప్పుడు మార్చి 22 అంటున్నారట. మరి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. మెగా ఫ్యామిలిలో మిగిలిన వారందరూ దూసుకెళ్ళిపోతుంటే.. నిహారిక, శిరీష్ లకు మాత్రం మెగా అభిమానులు మొహం చాటేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus