అదృష్టం తలుపు తట్టినప్పుడు ఆహ్వానించడం ఎంత అవసరమో… అలా వచ్చింది అదృష్టం కాదు అని ఊహించి జాగ్రత్తపడటమూ అంతే అవసరం. ఇలా జాగ్రత్తగా ఉన్నవాళ్లే సినిమా పరిశ్రమలో ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. అలాగే వరుస విజయాలు అందుకోగలుగుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… ఒక హీరో కథ నచ్చక, తనకు సరిపడదు అనుకునో, వర్కవుట్ కాదని వదిలేసిన కథను మరో హీరో చేస్తే అన్ని సార్లు విజయం సాధించాలని లేదు. అలాగే పేరు తీసుకురావాలని లేదు. ఇలా జరిగిన ఓ సినిమా ‘వేదం’.
స్క్రిప్ట్ సెలక్షన్ మీదే విజయాలు ఆధారపడతాయి అంటారు. అదే సమయంలో అదృష్టం, టైం కూడా కలిసి రావాలి అని చెబుతుంటారు. అలా కొన్నిసార్లు సమయం దొరక్క హీరోలు సినిమాఉ వదిలేస్తారు. అలా (Allu Arjun) అల్లు అర్జున్ చేసిన ఓ పెద్దగా లాభాలు రాని ఓ సినిమా ఎన్టీఆర్ (Jr NTR) చేయాల్సిందట. తొలుత ఆ దర్శకుడు ఆ సినిమా కథను తారక్ దగ్గరకు తీసుకెళ్తే… నా ఇమేజ్‌కి సరిపడదు అని వదిలేశారట. ఆ తర్వాత బన్నీ దగ్గరకు ఆ సినిమా వెళ్లడంతో ఆయన ఓకే చేశారట. ఈ సినిమా బాగా ఆడలేదా అంటే అడింది. కానీ అంతగా డబ్బులు రాలేదు అంటారు.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) ‘గమ్యం’ (Gamyam)లాంటి మంచి సినిమా చేశారు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో ‘వేదం’ (Vedam) సినిమా చేశారు. నాలుగు వేర్వేరు కథలను కలిపి ఈ సినిమా సిద్ధం చేశారు. యాంథాలజీ హైపర్ లింక్ సినిమా అని చెప్పొచ్చు. సమాజంలోని మనుషులు, వారి మనస్తత్వాలు, కోరికలు, సంఘర్షణ తదితర అంశాలు ప్రధానంగా ఈ సినమా సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ స్లమ్ బాయ్ రోల్ చేయగా, మంచు మనోజ్ (Manchu Manoj) రాక్ స్టార్ పాత్రలో కనిపించాడు.
ఈ చిత్రంలో అనుష్క (Anushka) వేశ్య పాత్ర చేసింది. ఇక ఈ సినిమా మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా ఆడలేదు. బన్నీ పాత్రను తారక్ కసం అనుకోగా ఆయన నో చెప్పారట. అయితే ఆయన నో అనడం వల్ల మంచి వసూళ్లు రాని సినిమాను వదిలేసినట్లే కానీ… నటుడిగా మంచి పేరొచ్చిన సినిమాను కూడా వదిలేసినట్లే అని చెప్పాలి. కేబుల్ రాజుగా బన్నీ ఈ సినిమాలో ఇరగదీశాడు.
ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు
భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?