Vijay Sethupathi: ఆ విషయంలో సేతుపతి తప్పు చేస్తున్నాడా?

విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్టర్, ఉప్పెన సినిమాల ద్వారా విజయ్ సేతుపతికి పాపులారిటీకి పెరిగింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ సేతుపతికి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నా విజయ్ మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఒకవైపు హీరో రోల్స్ లో, మరోవైపు విలన్ రోల్స్ లో నటిస్తూ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

కథ నచ్చితే ఎలాంటి పాత్రకైనా నటించడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తొమ్మిది రోజుల్లో విజయ్ సేతుపతి నటించిన మూడు సినిమాలు విడుదల కాగా ఆ మూడు సినిమాలు ఫ్లాప్ కావడం గమనార్హం. ఈ నెల 9వ తేదీన థియేటర్లలో లాభం సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. విజయ్, శృతిహాసన్ కలిసి నటించిన లాభం సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. సెప్టెంబర్ నెల 10వ తేదీన విజయ్ సేతుపతి హీరోగా నటించి సన్ టీవీలో డైరెక్ట్ గా రిలీజైన తుగ్లక్ దర్బార్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ నెల 17వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అనాబెల్ సేతుపతి రిలీజైంది. ఈ మూవీకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. కథల ఎంపిక విషయంలో సేతుపతి తప్పు చేస్తున్నాడని ప్రాధాన్యత లేని పాత్రలకు సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే సినిమాలతో సక్సెస్ అందుకోకపోతే విజయ్ సేతుపతి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus