Tollywood: సీక్వెల్ గండం నుంచి టాలీవుడ్ బయటపడినట్టేనా?

కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఫ్లాప్ అని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. తొలి భాగంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తున్న దర్శకులు సీక్వెల్ కోసం పేలమైన కథాంశాలను ఎంచుకోవడం, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే ప్రయత్నం చేయడంతో సీక్వెల్ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. మనీ సినిమాకు సీక్వెల్ గా మనీమనీ తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

గాయం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన గాయం2, సత్య సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన సత్య2 సినిమాలు సైతం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఆర్య2 సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు సీక్వెల్ గా శంకర్ దాదా జిందాబాద్ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకూడా ఫ్లాప్ అయింది.

అయితే ఇప్పుడు మాత్రం సీక్వెల్ గా తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. దృశ్యం సినిమా సక్సెస్ సాధించగా దృశ్యం సీక్వెల్ గా తెరకెక్కిన దృశ్యం2 సినిమా కూడా అంచనాలకు మించి విజయం సాధించింది. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పెళ్లిసందD సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ2 సినిమా కూడా ఘనవిజయం సాధించింది. సీక్వెల్ కు భిన్నమైన కథాంశాలను ఎంచుకున్న ప్రతిసారి దర్శకులు సక్సెస్ సాధిస్తున్నారు. ఎఫ్4, కార్తికేయ3, బింబిసార2, డీజే టిల్లు2, గూఢఛారి2, హిట్2 సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు మంచిరోజులు వచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus