యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఎస్.ఎస్.రాజమోళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి కలక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ భారీగా వసూళ్లను రాబట్టింది. 2015 జులై లో రిలీజ్ అయిన ఈ మూవీ అమెరికాలో 7 మిలియన్ డాలర్లు వసూలు చేసి తెలుగు చిత్రాల రేంజ్ ని పెంచింది. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు సినిమాలను చిన్నచూపు చూడడం మానేశారు. ఎక్కువరేట్లకు రైట్స్ కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. బాహుబలి ప్రభంజనం సృష్టించి ఒకటిన్నర ఏళ్లు అవుతున్నా ఇంకా కలక్షన్లలో నంబర్ వన్ గానే ఉంది. గతేడాది నాన్నకు ప్రేమతో రెండు మిలియన్ వరకు రాబట్టింది. ఈ ఏడాది రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150 అమెరికాలో 2 .3 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
అలాగే ఈనెల విడుదలయిన నాని “నేను లోకల్ ” మూవీ ఒక మిలియన్ డాలర్ల మార్క్ చేరుకోవడానికి పరుగులు పెడుతోంది. బాహుబలి విడుదలయినప్పటికీ ఇప్పటికీ అమెరికాలో తెలుగు సినిమాల మార్కెట్ విస్తరించింది. పబ్లిసిటీ పెరిగింది. వాస్తవానికి బాహుబలి రికార్డును ఎప్పుడో బీట్ చేయాలి. కానీ ఇప్పటికీ మూడు మిలియన్ కూడా ఏ తెలుగు చిత్రం వసూలు చేయలేదు. అందుకే బాహుబలి ఇప్పటికీ రారాజు గానే ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.