పుస్తకం రూపంలో ఉన్న కథను సినిమాగా తీయడం, సినిమాను పుస్తకం గా రాయడం ఇప్పటి వరకు విని ఉన్నాం. చూసి ఉన్నాం. బాహుబలి చిత్రం మాత్రం కొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ఈ మూవీకి బాహుబలి కంక్లూజన్ పేరిట కొనసాగింపు చిత్రం సిద్ధమవుతోంది. అంతేకాకుండా యానిమేషన్ సిరీస్ రెడీ అవుతోంది. ఈ ఫిల్మ్ లోని ప్రధాన పాత్రల బొమ్మలు, గేమ్స్ కూడా అందు బాటులోకి వచ్చాయి. తాజాగా బాహుబలి బిగినింగ్ కంటే ముందు ఏమి జరిగింది? అనే విషయంపై ఓ రచయిత పుస్తకం రాస్తున్నారు. కొచ్చికి చెందిన రచయిత ఆనంద్ నీలకంఠన్ బాహుబలి – బిఫోర్ ది బిగినింగ్ పేరుతో పుస్తకాల సిరీస్ ను తీసుకొస్తున్నారు.
సిరీస్ లో భాగంగా మొదటి పుస్తకం ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ని సిద్ధం చేసి కవర్ ను ఈ నెల 20న రిలీజ్ చేయనున్నారు. మిగిలిన రెండు పుస్తకాలు కీలక పాత్రధారి కట్టప్ప కి సంబంధించినవని చెబుతున్నారు. ముందుగా ఇంగ్లీషులో ఈ పుస్తకాల్ని రిలీజ్ చేసి తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బాహుబలి – ది కన్ క్లూజన్ విడుదల అనంతరం ఈ పుస్తకాలను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ పుస్తకాలు ఎన్ని రికార్డులు సృష్టించనుందో తెలియాలంటే మూడు నెలలు ఆగాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.