Harshaali Malhotra: సల్మాన్ ఖాన్ తో నటించిన మున్నీ.. ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూస్తే మతిపోతోంది!

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన బజరంగీ భాయిజాన్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం సినిమా ప్రియులకు తెలిసిదే. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించగా కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం అందించారు. 2015లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసుల కొల్లగొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ మూగ, చెవిటి చిన్నారిని.. కన్నవారి వద్దకు చేర్చేందుకు ఓ భారతీయ యువకుడు (సల్మాన్‌ ఖాన్‌) ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ.

ఇందులో మూగ,చెవిటి చిన్నారి పాత్రలో హర్షాలీ మల్హోత్రా (మున్నీ)గా మెప్పించింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే. కానీ అందులో సల్మాన్‌తో పోటీగా నటించి మెప్పించింది. తన అమాయకమైన ముఖంతో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించిన ఆమెను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాకు గాను ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుకు కూడా హర్షాలీ నామినేట్‌ అయింది. అప్పట్లో తనకు సుమారు రూ. 3 లక్షలు రెమ్యునరేషన్‌ ఇచ్చారని టాక్‌. తాజాగా ఆమె ఇప్పుడెలా ఉందో తెలుపుతూ ఒక వీడియో వైరల్‌ అయింది.

ఆ తర్వాత తను (Harshaali Malhotra) ఎలాంటి సినిమాల్లో మళ్లీ నటించలేదు. ప్రస్తుతం చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటుంది. కానీ సల్మాన్‌తో మాత్రం ఇప్పటికీ టచ్‌లోనే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. తను సంగీతం నేర్చుకునేందుకు వెళ్తుండగా కొందరు ఫోటో గ్రాఫర్లు హర్షాలీ మల్హోత్రాను కెమెరాలతో క్లిక్‌ మనిపించారు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్‌ మీడియా వైరల్‌ అవుతుంది.

బజరంగి భాయ్‍జాన్ సినిమాలో నటించినప్పుడు హర్షాలి 1వ తరగతి చదువుతుండేది. కాగా, ఇప్పుడు హర్షాలి వయసు 15 సంవత్సరాలు. ఆమె ప్రస్తుతం ఎలా ఉందో ఇక్కడ ఫొటోలు చూడండి. తన ఫొటోలను తరచూ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేస్తుంటుంది హర్షాలి. సోషల్ మీడియాలో హర్షాలి మల్హోత్రా చాలా పాపులర్. ఇన్‍స్టాగ్రామ్‍లో ఆమెకు ప్రస్తుతం 1.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ఫొటోలు, వీడియోలను ఆమె పోస్ట్ చేస్తూ ఉంటుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus