Kavya KalyanRam: కావ్య కళ్యాణ్ రామ్ -అల్లు అర్జున్ తో నో చెప్పడానికి కారణం అదేనా..

బలగం సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్. మొదట టాలీవుడ్ కు చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఒక ఫంక్షన్ లో కావ్యను చూశారట. ఆమె కళ్లు తనకు బాగా నచ్చడంతో తొలుత గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించడానికి అవకాశం ఇచ్చారట. ఆ సమయంలో తనకు సినిమాకు సంబంధించిన ఏ విషయాలు పెద్దగా తెలియవట. సినిమా షూటింగ్ అంటే ప్లే గ్రౌండ్ గా ఫీల్ అయి వెళ్లేదట.

అలా మొదలైన తన ప్రయాణం చిరంజీవి ,బాలయ్య, వెంకటేష్, పవన్ ,అల్లు అర్జున్ వంటి స్టార్లతో నటిస్తూ కొనసాగింది. బలగం, మసూద సినిమాల సక్సెస్ తో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయట. సినిమాలే కాకుండా కావ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అలాంటి అప్ కమింగ్ హీరోయిన్ అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తే నో అని చెప్పిందట.

ఏంటి రెండు హిట్స్ కే అమ్మడికి ఇంత గర్వం ఏంటి అని అవాక్కవుతున్నారా.. అయితే ఈ విషయం ఇప్పటిది కాదట.. గంగోత్రి సినిమా సమయంలో అల్లు అర్జున్ సరదాగా పెద్దయ్యాక నాతో హీరోయిన్గా నటిస్తావా అని అడిగారట.. దీంతో ఆమె అప్పటికి మీరంతా ముసలోళ్ళు అయిపోతారని చెప్పిందట.. అందుకే చేయనని చెప్పిందట (Kavya KalyanRam) కావ్య కళ్యాణ్ రామ్..

కానీ పెద్దయిన తర్వాత అల్లు అర్జున్ అప్పటికి ఇప్పటికీ తన క్రేజ్ లో మార్పు వచ్చిందని ఆయన అలాగే ఉన్నారని కావ్య తెలియజేస్తోంది. లాయర్ గా స్థిరపడాలనుకున్న కావ్య కరోనా టైంలో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయత్నం చేసి సక్సెస్ కొట్టినట్లు తెలిపింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus