Balagam: ఆ దేశంలో బలగం.. క్లిక్కయ్యేనా?

గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో బలంగా ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కమెడియన్ వేణు  (Venu Yeldandi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju)  అనుబంధ దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ చాలా తక్కువ బడ్జెట్ తోనే నిర్మించింది. ఇక సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది అని అందరూ ముందుగానే ఊహించారు. అయితే అందుకు అదనంగా సినిమా పెట్టిన పెట్టుబడికి అంతకుమించిన లాభాలను అందించడం విశేషం.

Balagam

ఈ మధ్యకాలంలో పెట్టిన బడ్జెట్ కు అత్యధిక స్థాయిలో లాభాలు అందించిన సినిమాలలో బలగం (Balagam) టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా చాలా ప్రముఖ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించబడింది. ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా పలు కీలకమైన అవార్డులను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ దర్శకుడిగా కూడా వేణు ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాలో ప్రియదర్శి  (Priyadarshi Pulikonda) కథానాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఇలాంటి సినిమాను ఇప్పుడు విదేశాల్లో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్ సిద్ధమయ్యారు. జపాన్లో తెలుగు సినిమాలకు ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రాజమౌళి (S. S. Rajamouli) తీసిన బాహుబలి (Baahubali) RRR అక్కడ మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు అదే తరహాలో అక్కడి జనాలను ఆకట్టుకునేందుకు బలగం సినిమా సిద్ధమైంది.

జపాన్ ప్రేక్షకులు మంచి ఎమోషన్స్ ఉన్న సినిమాలను ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బలగం సినిమాను కూడా అక్కడ గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 15వ తేదీన ఈ సినిమా జపాన్ భాషలో విడుదల కాబోతోంది. అక్కడి భాషకు తగ్గట్టుగా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. మరి జపాన్ ఆడియన్స్ ను బలగం సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus