Mogulaiah: తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న మొగిలయ్య!

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బలగం. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అందరి చేత కంటతడి పెట్టించడమే కాకుండా అందరి హృదయాలను ఎంతగానో ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ పాట పాడినటువంటి సింగర్ మొగిలయ్య ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత ఏడాది నుంచి బిపి షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య కిడ్నీలు కూడా పాడవడంతో వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వారానికి మూడు రోజులపాటు డయాలసిస్ చేయించుకుంటున్నారు.

అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి తెలిసి వేణు వీరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని తెలుస్తోంది. ఇలా డయాలసిస్ చేయించుకుంటున్నటువంటి మొగులయ్యకు గుండె సమస్యలు కూడా ఏర్పడ్డాయని తాజాగా వైద్యులు వెల్లడించారు.

దీంతో ఈయనకు (Mogulaiah) డయాలసిస్ చేయడానికి కూడా తన శరీరం సహకరించకపోవడంతో వెంటనే ఈయనని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలోని తమకు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలి అంటూ వేడుకుంటున్నారు.

ఇలా మొగిలయ్య బలగం సినిమాలో పాట పాడి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం ఈయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఈయనని ఏ క్షణమైన హైదరాబాద్ తరలించవచ్చని, ఈ క్రమంలోనే మనసున్న మారాజులు అలాగే ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలి అంటూ మొగిలయ్య కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus