Balagam Venu: నాన్నను తలచుకుంటూ బలగం వేణు ఎమోషనల్.. మిస్ యూ అంటూ?

గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో బలగం సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. చిన్న సినిమాలలో ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో వేణు పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగింది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి. బలగం సినిమా సక్సెస్ తో వేణుకు నాని సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే డైరెక్టర్ వేణు తన తండ్రి 24వ వర్ధంతి సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నా బలగం సినిమాను అందరూ చూశారు మా నాన్న తప్ప అంటూ ట్వీట్ చేశారు. 2000 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించగా వేణు తండ్రిని గుర్తు చేసుకుంటూ ఈ కామెంట్లు చేశారు. వేణు ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ కు 4400కు పైగా లైక్స్ వచ్చాయి. తండ్రి విషయంలో వేణు చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వేణు కొత్త సినిమాకు సంబంధించి త్వరలో అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. న్యాచురల్ స్టార్ నానిని వేణు ఏ విధంగా చూపించబోతున్నారో తెలియాల్సి ఉంది. వేణు రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వేణు తన ట్విట్టర్ పోస్ట్ లో తండ్రికి సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. వేణు (Balagam Venu) భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను అందుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

బలగం సక్సెస్ తర్వాత వేణుకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వేణు చాలా సంవత్సరాల క్రితమే సినిమాల్లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఉంటే మాత్రం కెరీర్ పరంగా మరింత ఎదిగేవాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

https://twitter.com/VenuYeldandi9/status/1755523660511891603

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus