బాలయ్య మాటల్లో ఖైదీ అంటే???
- January 11, 2017 / 06:24 AM ISTByFilmy Focus
నందమూరి నట సింహం బాలయ్య శాతకర్ణి గా గర్జించేందుకు సమయం ఆసన్నం అయ్యింది….ఇంకో 36గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది….బాలయ్య కరియర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 100వ చిత్రంగా ఈ చిత్రం రికార్డుల ప్రభంజనానికి శ్రీకారం చుడుతుంది…ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ స్క్రీనింగ్స్ తో.. విపరీతమైన హైప్ పెరిగిపోతోంది. మరోవైపు శాతకర్ణి మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్స్ ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహం అందిస్తున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య తెగ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రెస్ మీట్స్ లో భాగంగా మీడియా వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి బాలయ్యను మిగిలిన సినిమాల గురించి కూడా అడగడంతో వాటిపై స్పందించిన బాలయ్య ‘నాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత ముఖ్యమో.. చిరంజీవికి ఖైదీ నంబర్ 150 కూడా అంతే.
రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాలని.. రెండూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి విందు భోజనం కావాలని ఆశిస్తున్నా’ అన్నారు. అయితే సంక్రాంతి బరిలో నిలిచిన రెండు బడా సినిమాలను ఎలా చూడవచ్చు అంటే…సంక్రాంతి పోటీ ఎప్పుడూ జరుగుతుండేదే అని.. ఇందులో కొత్త ఏమీ లేదని తన మదిలోని మాటను తెలిపారు బాలయ్య. ఏది ఏమైనా….చారిత్రాత్మక సినిమా తీస్తున్న బాలయ్యను అభినందిస్తూ సినిమా ఘన విజయం సాదించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















