ఇది నెక్స్ట్ లెవల్ కాంబో.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే..!

నందమూరి బాలకృష్ణ, సాయి పల్లవి కలిసి సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. అయితే హీరో, హీరోయిన్లుగా కాదు తండ్రీ కూతుర్లుగా..! వినడానికి షాకింగ్ గా ఉన్నా.. ఇదే నిజం..! వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ యంగ్ డైరెక్టర్ బాలయ్యను కలిసి ఓ కథ వినిపించాడట. ఇది తండ్రీ, కూతుర్లకు సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన రివేంజ్ డ్రామా ఇదని తెలుస్తుంది.

దాంతో బాలయ్య ఓకే చెప్పేశాడట. అయితే కూతురి పాత్రలో నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ కావాలి. కాజల్ ను ఇదివరకు బాలయ్య సరసన హీరోయిన్ గా అడిగారు. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. దాంతో ఆమె వద్దు అని బాలయ్య చెప్పేశాడట. రష్మిక ప్రస్తావన కూడా వచ్చిందట. కానీ ఆమె ఇప్పుడు బాలీవుడ్లో సినిమాలు చేస్తుంది.. పైగా చాలా బిజీగా ఉంది కాబట్టి ఆమెను కూడా లైట్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇక సాయి పల్లవి అయితే బాగుంటుంది అని భావించి ఆమెను సంప్రదించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.

ఇక బాలకృష్ణ సరసన ఓ సీనియర్ హీరోయిన్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక్కసారి సాయి పల్లవి కనుక ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పేస్తే.. 3 నెలల్లో ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసి విడుదల చెయ్యడానికి బాలయ్య అలాగే ఆ యంగ్ డైరెక్టర్ రెడీగా ఉన్నారట. అవసరమైతే తన సొంత బ్యానర్ పైనే బాలయ్య ఈ సినిమాని నిర్మిస్తాను అని ఆ యంగ్ డైరెక్టర్ కు హామీ ఇచ్చాడట. చూడాలి మరి చివరికి ఏమవుతుందో..!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus