Balakrishna: ఆ దర్శకునిపై కోపంగా ఉన్న బాలయ్య?

స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ మూవీ షూటింగ్ పూర్తైంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య రిలీజ్ డేట్లకు సంబంధించిన స్పష్టత వచ్చిన తర్వాత ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. బాలయ్య తరువాత సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనుండగా అక్టోబర్ 1 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.

విజయ్ సేతుపతికి పాన్ ఇండియా నటుడిగా పేరు ఉండటంతో విజయ్ ఈ సినిమాలో నటిస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి విజయ్ సేతుపతి నో చెప్పినట్టు సమాచారం. విజయ్ సేతుపతి నో చెప్పారనే విషయం తెలిసి మేకర్స్ పై, డైరెక్టర్ పై బాలయ్య కోపంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అయితే విజయ్ సేతుపతిని కన్విన్స్ చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని బాలకృష్ణ భావిస్తున్నట్టు భోగట్టా. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని నెలల తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ షూటింగ్ కూడా మొదలు కానుంది. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు, స్టార్ డైరెక్టర్లకు మాత్రమే బాలకృష్ణ తన సినిమాలకు డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus