ఆరోజే బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్తలు.. ఎప్పుడంటే?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి బాలయ్యతో మరో సినిమాతో సక్సెస్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ప్రకటన వెలువడలేదు. దసరాకు ఈ సినిమా రిలీజ్ అని ప్రకటన వచ్చినా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత లేదనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య ఫ్యాన్స్ ఎదురుచూపులకు జూన్ 10వ తేదీన ఫలితం దక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆరోజే టైటిల్, రిలీజ్ డేట్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ అవుతుందని అదే సమయంలో బాలయ్య కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ సక్సెస్ సాధిస్తే బాలయ్య పారితోషికం పెరగనుంది. రాబోయే రోజుల్లో కూడా బాలయ్యకు వరుస విజయాలు దక్కితే బాలయ్య పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

బాలయ్య మాస్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నా ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చే కథలను బాలయ్య ఎంచుకుంటున్నారు. శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో కాజల్ నటిస్తున్నారు. బాలయ్య కాజల్ జోడీ బాగుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.

ఈ ఏడాది రెండు సినిమాలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. బాలయ్య యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా బాలయ్య జాగ్రత్త పడుతున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus