Balakrishna, Anil Ravipudi: అఖండ సక్సెస్ తో వాళ్లకు కాన్ఫిడెన్స్ వచ్చిందా?

స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనులతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ మొదలు కానుందని తెలుస్తోంది. బాలయ్య ఒకే సమయంలో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తారని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో బాలయ్య అనిల్ కాంబో మూవీ తెరకెక్కనుంది.

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి బాలయ్య కోసం అదిరిపోయే స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. హరీష్ పెద్ది, సాహో గారపాటి బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. అఖండ సక్సెస్ తో నిర్మాతలకు కాన్ఫిడెన్స్ వచ్చిందని బాలయ్యతో భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

వయస్సు పెరుగుతున్నా బాలయ్య మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందనే సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ షోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బాలయ్యకు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. 2022 సంవత్సరంలో కూడా బాలయ్య వరుస విజయాలు అందుకుంటారేమో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus