బాలయ్య వచ్చేశాడు.. మరి చిరు..?

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలో షూటింగులన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. గత నెల రోజుల నుండే సినిమా షూటింగ్ లను పునః ప్రారంభించారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇలాంటి సమయంలో కూడా బాలయ్య, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు షూటింగ్ లకు వెళ్లలేదు. దీంతో వారు నటిస్తోన్న సినిమా షూటింగ్ లను ఇంకా మొదలుపెట్టలేదు. ఎట్టకేలకు బాలయ్య తన సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గురువారం నుండి పునః ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘బీబీ3’ గా పిలుచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు బోయపాటి స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం బాలయ్య నిర్విరామంగా పని చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత షెడ్యూల్స్ లో సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.

బాలయ్య షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో.. మరో సీనియర్ హీరో చిరు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమా షూటింగ్ ల విషయంలో ఆతృతగా కనిపించే చిరు ఇప్పటికీ రంగంలోకి దిగకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరో రెండు, మూడు రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కూడా మొదలవుతుందని.. ముందుగా చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. నవంబర్ మొదటి వారంలో చిరు సెట్స్ పైకి వస్తారని చెబుతున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus