Balakrishna: బాలయ్య సినిమా.. ప్రచారంలోకి కొత్త టైటిల్స్‌.. ఏది పెడతారంటూ..!

బాలకృష్ణ(Balakrishna) సినిమాల టైటిల్స్‌ అన్నింటిలో ‘సింహం’ ఉంటుంది అని అనం కానీ.. చాలా వరకు ఆయన హిట్‌ సినిమాల్లో ‘సింహం’ పక్కగా ఉంటుంది. అది ఏ లాంగ్వేజ్‌ అయినా ‘సింహం’ పక్కా. అయితే బాబీ డైరక్షన్‌లో కొత్తగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌లో సింహం ఉండదు అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కింద చెప్పబోయే రెండు టైటిల్స్‌లో ఒకటి ఉండొచ్చు అని చెబుతున్నారు. ప్రతి సంక్రాంతికి బాలయ్య నుండి ఓ సినిమా రావడం..

Balakrishna

ఆ సినిమా టీజర్‌ దసరా సందర్భంగా రావడం మనకు తెలిసిన విషయమే. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే చిన్న మార్పు ఉంది. బాబీ (Bobby) దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు సంబంధించి పోస్టర్‌ దసరాకు ఇచ్చి.. దీపావళికి టీజర్‌ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో సినిమాకు అనుకుంటున్న రెండు టైటిల్స్‌ బయటకు వ్చాయి. సినిమా నేపథ్యం బట్టి ఒక సినిమా పేరు అనుకోగా.. సినిమాలోని మెయిన్‌ ట్విస్ట్‌ను చెప్పేసేలా మరో టైటిల్‌ ప్లాన్‌ చేశారట.

సినిమాలో బాలయ్య ఓ బందిపోటులా కనిపిస్తాడు అని గతంలో తెలిసింది. కాన్సెప్ట్‌ పోస్టర్‌లోనూ ఆ అంశాలే ఉన్నాయి. అందుకే ‘డాకూ మ‌హారాజా’ అని పెడదాం అనుకుంటున్నారట. ఇక సినిమాలో అసలు ట్విస్ట్‌ చెప్పేలా ‘స‌ర్కార్ సీతారామ్’ అని కూడా పెట్టొచ్చు అని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఒక‌టి ఫిక్స్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువమంది ఆలోచన ‘డాకూ మహారాజా’తోనే ఉందట.

మరి ఏ పేరు పెడతారో చూడాలి. ఇక ఈ సినిమా డిసెంబరు ఆఖరున కానీ, సంక్రాంతికి కానీ తీసుకొస్తారని టాక్‌. ఆ విషయంలో ఈ రోజు క్లారిటీ వచ్చేస్తుంది అని చెబుతున్నారు. ఒకవేళ ఇప్పుడు చెప్పకపోతే దీపావళికి చెబుతున్నారు. డిసెంబరులో కానీ బాలయ్య రాకపోతే.. ‘పుష్ప: ది రూల్‌’కి (Pushpa 2)  మరిన్ని రోజులు ఇచ్చినట్లే అని చెప్పాలి. చూద్దాం బాలయ్య ముహూర్తాల లెక్క ఏం చెబుతుందో?

జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌ మీద అల్లుడు ఫిర్యాదు.. లైంగికంగా ఇబ్బంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus