Balayya Babu: ఆ విషయంలో బాలయ్య మాట మీద నిలబడలేరా?

స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటుండగా అభిమానుల కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది. ఈ సెకండ్ ఎపిసోడ్ కు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ తల్లి మాట్లాడుతూ విశ్వక్ సేన్ వయస్సు చిన్నదని ఎక్కువ బాధ్యతలు తీసేసుకున్నాడని ఇంత చిన్న వయస్సులో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం అంటే వయస్సుకు మించిన భారం మోస్తున్నాడని అనిపిస్తోందని విశ్వక్ సేన్ తల్లి పేర్కొన్నారు.

విశ్వక్ సేన్ తండ్రి మాట్లాడుతూ విశ్వక్ సేన్ నూటికి నూరు శాతం తాను చెప్పిందే కరెక్ట్ అవుతుందని అనుకుంటాడని విశ్వక్ సేన్ తండ్రి వెల్లడించారు. నేను ఎంత చెప్పినా వినడని ఒక్కోసారి నన్ను కూడా తక్కువ చేసి మాట్లాడటం జరుగుతుందని విశ్వక్ సేన్ తండ్రి వెల్లడించారు. అయితే కెరీర్ పరంగా నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నాడని విశ్వక్ సేన్ తండ్రి పేర్కొన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ ప్రస్తుతం పేరెంట్స్ తో ఉండటానికి కూడా సమయం దొరకడం లేదని కామెంట్లు చేశారు.

2023 జనవరి నుంచి నెలలో పది రోజులు ఇంటికే కేటాయిస్తానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ నేను కూడా నా భార్య వసుంధరకు ఎన్నో ఒట్లు వేస్తానని ప్రతి ఆదివారం నేను పని చేయనని చెబుతానని కానీ ఆ మాటను నిలబెట్టుకోనని కామెంట్లు చేశారు.

బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య107 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus