Balakrishna: ప్రభాస్ హీరోయిన్ కావాలంటున్న బాలయ్య.. ఏమైందంటే?

స్టార్ హీరో బాలకృష్ణ రియల్ లైఫ్ లో చాలా సరదాగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ షోకు బాలయ్య సక్సెస్ ఫుల్ హోస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ షో ఆరో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ఈ షోలో బాలయ్య మాట్లాడుతూ నా తర్వాత సినిమాలో కృతిసనన్ హీరోయిన్ అని కామెంట్ చేశారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా కృతిసనన్ నటించిన సంగతి తెలిసిందే.

ప్రభాస్, మహేష్ లకు జోడీగా నటించిన కృతి సనన్ బాలయ్యకు జోడీగా నటించడానికి ఓకే చెబుతారేమో చూడాల్సి ఉంది. బాలయ్య ఈ ఎపిసోడ్ తో కూడా మంచి మార్కులు సొంతం చేసుకున్నారు. వచ్చే వారం ఈ షోలో ప్రభాస్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఎంతో స్పెషల్ గా ఉండనుందని బోగట్టా. ప్రభాస్ అన్ స్టాపబుల్ షోలో ఎలాంటి రహస్యాలను వెల్లడించారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ మ్యారేజ్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ షో ద్వారా అందుకు సంబంధించి స్పష్టత వస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్స్ ను ఈ షోలో రివీల్ చేసినట్టు తెలుస్తోంది. గోపీచంద్ కూడా ఈ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారని సమాచారం అందుతోంది.

న్యూ ఇయర్ కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా ఈ నెల 27వ తేదీన పవన్ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ గురించి ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus