కొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్ రేట్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా వేదికగా, పలు స్టేజ్ లపై ఈ విషయం గురించి మాట్లాడారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఇదే విషయంపై రియాక్ట్ అయ్యారు. ‘అఖండ’ సంక్రాంతి సంబరాలు పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఈ వేదికపై సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు బాలకృష్ణ.
అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిస్థితులపై స్పందిస్తూ.. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా రంగానికి సహకరించాలని కోరారు. ఇండస్ట్రీపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వాలు సహకరించాలని అన్నారు. సినిమా టికెట్ ధరపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాను కట్టుబడి ఉంటానని చెప్పిన బాలయ్య.. ఇండస్ట్రీలో పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా లేదని అన్నారు.
పెద్ద సినిమా ఫ్లాప్ అయితే చిన్న సినిమా అవుతుందని.. చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అవుతుందని అన్నారు. ఇండస్ట్రీలో అందరూ కలిసి చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిస్తామని చెప్పారు. ఏదో ఒక్కరి అభిప్రాయం కాదని.. అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి సరైన రిప్రజెంటేషన్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమా..? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..?’ అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!