Balakrishna: ఇండస్ట్రీపై బాలకృష్ణ కామెంట్స్‌.. వినాల్సిన వాళ్లు ఎవరు?

కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకులు అభిరుచులు మారాయా? ఇలాంటి సినిమాలే చూస్తాం అని లెక్కలేసుకొని థియేటర్లకు వస్తున్నారా? ఈ సినిమా మా ఆలోచనలకు తగ్గట్టుగా లేదు అని పక్కన పెట్టేస్తున్నారా?.. ఈ మాటలు ప్రేక్షకులు నేరుగా చెప్పలేదు కానీ.. ఇలాంటి ఆలోచనలతో కొన్ని సినిమాల్ని దూరంగా పెడుతున్నారు అనే చర్చ అయితే ఉంది. దీంతో టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు, నటులు తమ సినిమాల విషయంలో మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది అని అయితే అంటున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఇదే తరహా కామెంట్స్‌ చేశారు.

మనిషి దైనందిన జీవితంలో అన్నవస్త్రాలతో పాటు వినోదాన్ని కూడా ఓ సాధనంగా ఎంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఎలాంటి సినిమాలు ఇవ్వాలి అని పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి అంటూ బాలకృష్ణ కామెంట్‌ చేశారు. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ఈ మేరకు కొన్ని కామెంట్స్‌ చేశారు బాలయ్య. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆయన ఏ సినిమాల గురించి అన్నారు, ఎవరు గురించి చెప్పారు, ఇప్పుడు ఎవరు ఆయన మాటలకు రిప్లై ఇవ్వాలి అనే చర్చ నడుస్తోంది.

‘ఊర్వశివో రాక్షసివో’ ట్రైలర్‌ బాగుంది. నాకూ ఇలాంటి సినిమాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే నా పరిమితులు నాకున్నాయి. నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చని సినిమాను వాళ్లపై బలవంతంగా రుద్దాలని అనుకోను అని తన ఆలోచనను చెప్పారు బాలయ్య. అయితే బాలయ్య ఇప్పుడు ఇలాంటి రొమాంటిక్‌ (?) ప్రేమకథల్లో నటిస్తే బాగోదు అనే విషయమూ అందరికీ తెలుసు. అయితే బాలయ్య చెప్పిన ప్రేక్షకులకు ఎలాంటి కథలు కావాలో అలాంటివే చేయండి అని బాలయ్య ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు.

టాలీవుడ్‌లో మాస్‌ కథలకు, యాక్షన్‌ సినిమాలకు బాలయ్య కేరాఫ్‌ అడ్రెస్‌. గత కొన్నేళ్లుగా అలాంటి కథలతోనే రాణిస్తున్నాడు. ఇటీవల భారీ విజయాలు కూడా అలాంటి మూస కథలతోనే వచ్చాయి. మరిప్పుడు బాలయ్య చెప్పిన ‘ప్రేక్షకులకు నచ్చిన సినిమలు’ ఫార్ములా ఏంటో అర్థం కావడం లేదు. తెలుగు ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు చూస్తారు. ఫార్ములాలు, కాంబినేషన్‌లు అనేవి కేవలం తొలి షోకి జనాలు రావడానికే అనే మాట కూడా టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus