Balakrishna: ఎన్టీఆర్‌ జీవితాన్ని పాఠ్యాంశం చేయాలి: బాలకృష్ణ

  • May 28, 2021 / 12:15 PM IST

తెలుగువాళ్ల జీవితంలో ఎన్టీఆర్ స్థానం ఎప్పటికీ అజరామరం. అయితే అలాంటి ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలని చాలా రోజుల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ తయనుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ 98వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

నందమూరి తారకరామారావు యుగపురుషుడు, పేదల పెన్నిదని బాలకృష్‌ణ కొనియాడారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను విద్యార్థులకు తెలిపేలా పాఠ్యాంశంగా చేయాలని చాలా రోజుల నుండి డిమాండ్‌ చేస్తున్నాం. నా తండ్రి సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. ఎన్టీఆర్‌పై ఎంతో మంది పుస్తకాలు రాశారు. అయితే ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకురావాలని మరోసారు డిమాండ్‌ చేశారు బాలయ్య.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus