Balakrishna: హీరోలు, డైరక్టర్లు జగన్‌ను కలవడంపై బాలయ్య చర్చ!

  • December 5, 2022 / 03:04 PM IST

నందమూరి బాలకృష్ణ మనసులో ఉన్న ఆలోచనలు, సిద్ధాంతాలు, ఉద్దేశాలు ‘అన్‌స్టాపబుల్‌’ షోలో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. గత సీజన్‌లోనూ అదే జరిగింది, ఇప్పటి సీజన్‌లోనూ అదే జరుగుతోంది. అయితే ఆ షోకు వచ్చేవాళ్లు ఏం సమాధానాలు చెబుతారో ముందుగానే ఆలోచించే ఆ ప్రశ్నలు ఉంటాయని చెప్పొచ్చు. తాజా ఎపిసోడ్‌లోనూ అలాంటివే కొన్ని కనిపించాయి. అందులో ఒకటి సినిమా టికెట్‌ ధరలు. ఆ సమయంలో జరిగిన చర్చలు, మీటింగ్‌లు. బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ షో రెండో సీజన్‌ ఇటీవల ఎపిసోడ్‌లో సీనియర్‌ నిర్మాతలు డి.సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌.. సీనియర్‌ దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వచ్చారు.

సురేశ్‌బాబు, అల్లు అరవింద్ ఉన్నప్పుడు బాలయ్య ఓ ప్రశ్న అడిగారు. దానికి వాళ్లిద్దరూ చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కరోనా – లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినీ హీరోలు, నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించిన విషయం తెలిసిందే. నిర్మాతల బృందం విజయవాడ వెళ్లి మరీ సీఎం జగన్‌ను, మంత్రులను కలిసింది. థియేటర్ల రీ ఓపెనింగ్, టిక్కెట్ ధరల సవరణ వంటి అంశాలపై చర్చించింది. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వెళ్లి సీఎంను కలిశారు.

అయితే ఈ బృందాల్లో సురేష్ బాబు, అల్లు అరవింద్‌ లేరు. ఈ విషయాన్నే బాలకృష్ణ ప్రశ్నించారు. దీనికి సురేష్ బాబు సమాధానమిస్తూ ‘‘టికెట్‌ రేట్ల విషయంలో సీఎం జగన్‌ను కలిసిన వాళ్ల నిర్ణయాన్ని నేను అంగీకరించలేకపోయాను. నా వ్యక్తిగత అభిప్రాయం వేరే. సినిమా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కొన్ని సినిమాలకు టికెట్ రేట్లు ఎక్కువ ఉండాలనే నిర్ణయానికి నేను వ్యతిరేకం. అన్ని సినిమాలకు అందుబాటు ధరలోనే టిక్కెట్ రేట్లు ఉండాలి. ఆ ధరలతోనే మొత్తం కలెక్షన్లు వస్తాయని నాకు నమ్మకం. కొందరు ధరలు పెంచాలని అడుగుతున్నప్పుడు నేను వెళ్లి వాళ్లను బాధపెట్టడం ఇష్టం లేక వాళ్లతో వెళ్లలేదు’’ అని సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు.

ఇదే విషయంలో అల్లు అరవింద్ స్పందిస్తూ ‘‘విజయవాడ వెళ్లడానికి ముందు రోజు చిరంజీవి, నేను మాట్లాడుకున్నాం. మీరు వెళ్తున్నారు కాబట్టి ఒకే కుటుంబం నుండి ఇద్దరు ఎందుకు అని నేను ఆగిపోయాను’’ అని చెప్పారు. అయితే, టిక్కెట్ రేట్ల మీద క్లారిటీ ఉందని చెప్పారు. అయితే ఆ రోజుల్లో సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో అప్పుడు సినిమాల రిలీజ్‌ ఉన్న వాళ్లందరూ వెళ్లారు. వెళ్తే పని అవుతుందని అని అనుకున్న వాళ్లు వెళ్లారు. వెళ్లనివారికి అప్పుడు సినిమాలు లేవు, వెళ్లినా పని అయ్యే పరిస్థితి లేదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus