Balakrishna: పాన్ ఇండియాపై దృష్టి పెట్టిన నటసింహం!

ప్రస్తుతం దేశమంతటా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇతర భాషల్లో మార్కెట్ ను పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. స్టార్ హీరో బాలకృష్ణ కూడా తన భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య సినిమాలు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా బాగానే కలెక్షన్లను సాధిస్తాయి. బాలయ్య నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ కావడంతో పాటు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి.

బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా ఫిక్స్ అయింది. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్ప సినిమా ద్వారా ఇతర భాషల్లో కూడా మంచి లాభాలను సొంతం చేసుకోవడంతో తమ భవిష్యత్తు ప్రాజెక్టులను సైతం పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని బాలయ్య అఖండ సక్సెస్ తర్వాత మార్కెట్ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

గోపీచంద్ మలినేని సినిమా కోసం బాలయ్య 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా 200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మాస్ సినిమాలకు హిందీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి హిట్ టాక్ వస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం కష్టమేమీ కాదు. గత కొన్నేళ్లుగా రెమ్యునరేషన్ విషయంలో వెనుకబడిన బాలయ్య వరుసగా విజయాలను సొంతం చేసుకొని భారీ మొత్తంలో పారితోషికం తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

క్రాక్ సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “జై బాలయ్య” అనే టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus