Balayya Babu: అన్ స్టాపబుల్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి ఆదరణ పొందారు. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వ్యాఖ్యాతగా బాలకృష్ణ ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు.ఈ కార్యక్రమం మొదటి సీజన్ విజయవంతం కావడంతో నిర్వాహకులు ఇంతకుమించి రెండవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండవ సీజన్ ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే రెండవ సీజన్లో భాగంగా ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కార్యక్రమం పై ఇటు ప్రేక్షకులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు.ఈ విధంగా రెండవ సీజన్లో మొదటి ఎపిసోడ్ హైలైట్ కావడంతో రెండవ ఎపిసోడ్ కు టాలీవుడ్ యంగ్ హీరోలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రెండవ ఎపిసోడ్లో భాగంగా విశ్వక్ సేన్,సిద్దు జొన్నలగడ్డ హాజరైన విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేయక ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ హీరోలతో కలిసి ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ సందడి చేశారు. ఇకపోతే తాజాగా మరొక ప్రోమోని కూడా ఆహా విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో సిద్దు జొన్నలగడ్డను ప్రశ్నిస్తూ మీ లైఫ్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటూ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే సిద్దు సమాధానం చెబుతూ తను హీరోగా ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు తనని నీ మొహానికి నువ్వు హీరో కావడం ఏంటి అంటూ అవమానించారని చెప్పారు.ఇలా సిద్దు జొన్నలగడ్డ ఎదుర్కొన్న అవమానం గురించి తెలుసుకున్న వెంటనే బాలయ్య కళ్లనిండా నీళ్లు పెట్టుకున్నారు.నీకు జరిగిన అవమానం వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అంటూ బాలయ్య ఎమోషనల్ అవ్వడమే కాకుండా సిద్దు జొన్నలగడ్డను దగ్గరకు పిలిచి తనను గట్టిగా హత్తుకున్నారు. ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus