NBK107: బాలయ్య గోపీచంద్ కాంబో మూవీకి ప్రాబ్లమ్ ఇదే!

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి సంబంధించి వస్తున్న అప్ డేట్ల విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారనే సంగతి తెలిసిందే. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 23వ తేదీన బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ రిలీజ్ కానుంది. వాస్తవానికి మైత్రీ నిర్మాతలు డిసెంబర్ 23వ తేదీన విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో అదే తేదీన బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.బాలయ్య అభిమానులు మాత్రం బాలయ్య సినిమాలు సంక్రాంతికి విడుదలై మెజారిటీ సందర్భాలలో విజయం సాధించాయని చెబుతున్నారు.

అయితే 2023 సంక్రాంతి పండుగ కానుకగా మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో మేకర్స్ బాలయ్య సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్యకు జోడీగా శృతి నటిస్తుండగా శృతి హాసన్ రోల్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.బాలయ్య శృతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

గోపీచంద్ మలినేని శృతి కాంబోలో వచ్చిన బలుపు, క్రాక్ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ను మేకర్స్ పరిశీలిస్తుండగా త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus