Balakrishna: బాలయ్య అంకితభావానికి ఫిదా అయిన ఫ్యాన్స్!

  • October 9, 2021 / 04:55 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఆరు పదుల వయస్సులో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షో ప్రసారం కానున్నట్టు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే టాక్ షో ఫోటో షూట్ సమయంలో బాలకృష్ణ కాలికి చిన్న గాయమైందని తెలుస్తోంది. కాలికి గాయమైనా బాలకృష్ణ మాత్రం సమయాన్ని ఏ మాత్రం వృథా చేయకుండా ఫోటో షూట్ ను పూర్తి చేశారు. బాలకృష్ణకు పని విషయంలో ఉన్న అంకితభావాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తూ బాలకృష్ణ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ నవంబర్ 4వ తేదీన రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించనున్నారు. త్వరలో అఖండ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం. 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ అఖండ కావడం గమనార్హం. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus