ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా స్టార్స్ కి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెవుతున్నారు. అది ఆయనకు మేలు చేసే అంశమే. సినిమాకు రాజకీయానికి అవినాభావ సంబంధం ఉంది. భారీ ఫ్యాన్ బేస్ కలిగిన స్టార్ హీరోలకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలు గుర్తుపెట్టుకొని విషెష్ చేయడం వలన రాజకీయ నాయకులకు ఎంతో కొంత ప్రయోజనం ఒనగూరుతుంది అనడంలో సందేహం లేదు. కాగా సీఎం జగన్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఆయన ఆయురారోగ్యాలతో బాగుండాలని, మంచి సినిమాలు తీయాలని కోరుకున్నారు. చిరంజీవికి జగన్ విషెష్ చెప్పడం అంత విశేషంగా ఎవరు భావించలేదు. దానికి కారణం జగన్ తో చిరంజీవికి ఉన్న సత్సంబంధాలే. సీఎంగా జగన్ అధికారంలోకి రాగానే చిరంజీవి సతీసమేతంగా ఆయన్ని కలవడం జరిగింది. అలాగే జగన్ మూడు రాజధానులు నిర్ణయాన్ని కూడా ఆయన సమర్ధించారు. కాగా నేడు కింగ్ నాగార్జునకు కూడా జగన్ బర్త్ డే విషెష్ చెప్పారు.
ఐతే జూన్ 10న బాలయ్య జన్మదినం జరుపుకున్నారు. అప్పుడు జగన్ బాలయ్యకు పుట్టినరోజు శుభాకంక్షలు చెప్పలేదు. ప్రత్యర్థి కావడం వలన అనుకోవడానికి రాజకీయాలలో అధికార ప్రతిపక్ష నేతలు కూడా బర్త్ డే విషెష్ చెప్పుకుంటారు. అంతకు మించి జగన్ ఒకప్పుడు బాలయ్య వీరాభిమాని అని, అభిమాన సంఘ అధ్యక్షుడని ప్రచారం జరగగా, ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదు.
Most Recommended Video
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!