Balakrishna, Koratala Siva: కొరటాలకు మరో నందమూరి హీరో ఓకే చెప్పారా?

కొరటాల శివ తర్వాత సినిమా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తారక్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ నవంబర్ నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఆచార్య సినిమా విషయంలో జరిగిన తప్పు ఎన్టీఆర్ మూవీ విషయంలో జరగకూడదనే ఆలోచనతో కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. అయితే బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను పూర్తి చేసి బాలయ్య ఈ సినిమాలో నటించనున్నారు.

నిర్మాత నాగవంశీ స్వాతిముత్యం సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలయ్యతో ఒక సినిమాను నిర్మించనున్నామని వెల్లడించారు. నాగవంశీ ఆ విధంగా చెప్పడంతో బాలయ్య కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అధికారికంగా ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ సినిమా తర్వాత కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి వివరాలు వెల్లడి కాలేదు.

ఆచార్య సినిమా వల్ల కొరటాల శివ వ్యక్తిగతంగా, ఆర్థికంగా నష్టపోయారు. బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ గురించి వైరల్ అవుతున్న వార్తలు నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు కొరటాల శివ 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus