Balakrishna: లైగర్ కోసం వచ్చిన బాలయ్య.. ఆ సర్‌ప్రైజ్‌ ఎందుకంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ – డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ పై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ తో పాటు కరణ్ జోహార్ సహనిర్మాతలు కొనసాగుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ ను ఇటీవల గోవాలో మొదలుపెట్టారు.

అయితే షూటింగ్ జరుగుతుండగా లొకేషన్ లోకి నందమూరి బాలకృష్ణ సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అనంతరం విజయ్ దేవరకొండ నందమూరి బాలకృష్ణ చార్మి పూరి జగన్నాథ్ నలుగురు ఒకే తరహాలో కెమెరాకు స్టిల్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాలకృష్ణ అక్కడికి ఎందుకు వచ్చారు అనే వివరాల్లోకి వెళితే ప్రస్తుతం అఖండ షూటింగ్ కూడా గోవాలో జరుగుతోంది. ఇక లోకేషన్ కు సమీపంలోనే ఉన్న లైగర్ సెట్లోకి నందమూరి బాలకృష్ణ సరదాగా వెళ్లారు.

పూరి జగన్నాథ్ ఇదివరకే బాలయ్యతో పైసా వసూల్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం అయితే ఏర్పడింది. ఆ స్నేహంతోనే నందమూరి బాలకృష్ణ లైగర్ సెట్లోకి వచ్చారు. భవిష్యత్తులో వీరి కాంబినేషన్ లో మరొక సినిమా కూడా రానున్నట్లు సమాచారం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus