ఎన్టీఆర్ కాకుండా బాలయ్య అయితే ఏమయ్యెదో??
- April 18, 2017 / 07:41 AM ISTByFilmy Focus
టాలీవుడ్ ను ఏలుతున్న వారిలో నందమూరి వారసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అయితే అదే క్రమంలో టాలీవుడ్ నట సింహం నందమూరి బాలయ్య ఒక పక్క, మరో పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలసి టాలీవుడ్ రికార్డులను ఒక ఆట ఆడుకుంటున్నారు…ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఒక సంచలన హిట్ అందుకున్న సింహాద్రి మీకు గుర్తు ఉందా?? ఎందుకు ఉండదు….అది ఎలాంటి సినిమా…టాలీవుడ్ రికార్డులను తిరగ రాసి….ఎన్టీఆర్ స్టామినా ఏంటో అందరికీ పరిచయం చేసిన సినిమా…టాలీవుడ్ లో బడా హీరోలుగా ఉన్న ఎందరో హీరోలు అప్పట్లో ఎన్టీఆర్ సినిమా అంటే భయపడేలా చేసిన సినిమా…అయితే అదే క్రమంలో ఆ సినిమా కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒకానొక ఇంటెర్వ్యులో మాట్లాడుతూ….ఈ సినిమాపై కొన్ని సంచలన విషయాలు బయట పెట్టాడు.
ఆయన మాట్లాడుతూ…అసలు ఈ కథ రాసింది తారక్ కోసం కాదని… నందమూరి బాలకృష్ణ కోసం ఈ కథ రాసుకున్నా అని….అయితే అప్పుడు బాలయ్య డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో జూనియర్ దగ్గరకు వెళ్లింది ఈ కథ అని ఆయన తెలిపాడు…ఇక అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ తో తారక్ రాజమౌళిలి ఓ అండర్ స్టాండింగ్ తో ఉండడం…అదే కాంబినేషన్ లో సింహాద్రి సినిమా వచ్చింది. సింహాద్రికి ముందు ఎన్.టి.ఆర్ స్టార్ హీరో మాత్రమే సింహాద్రి సంచలనాల తర్వాత అతనో సూపర్ స్టార్ అయ్యాడు. అయితే ఇక్కడ మన చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే…ఈ సినిమా ఎన్టీఆర్ కే కాదు….బాలయ్య చేసిన అప్పట్లో రికార్డుల దుమ్ము దులిపేసే సినిమా అయ్యేది అనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు…మొత్తంగా అదీ మ్యాటర్…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















