Balakrishna, Chiranjeevi: బాలయ్య సినిమా విషయంలో ఇక నిర్ణయం నిర్మాణ సంస్థదేనా?

#NBK107 షూటింగ్‌ మొదలైనప్పుడు దసరాకు సినిమా రావొచ్చు అని అన్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు. బాలయ్యకు సంక్రాంతి బాగా కలిసి వస్తుంది కాబట్టి.. ఫ్యాన్స్‌ కూడా చాలా హ్యాపీ. అయితే ఈ రెండు రిలీజ్‌ డేట్‌ల మధ్య ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. అదే చిరంజీవితో బాలయ్య పోరు. దసరాకు వచ్చినా, సంక్రాంతికి వచ్చినా చిరు వర్సెస్‌ బాలయ్య తప్పదు.

బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిర్మాతల బంద్‌ లేకపోయి ఉంటే ఈ పాటికి చాలా వరకు షూటింగ్‌ అయిపోయేది. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల కర్నూలులో జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాను విడుదల చేయడానికి మంచి తేదీ కోసం చూస్తుంటే సంక్రాంతి అయితే బాగుంటుందని టీమ్‌ సూచించిందట. దీంతో 2023 పొంగల్‌ అని ఫిక్స్‌ అవుతున్నారట.

ఇందులో ఇబ్బందేమీ లేదు. అయితే ఇప్పటికే ఆ డేట్‌ను చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు ), ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ ఉన్నాయి. చాలా రోజుల క్రితమే ఈ సినిమాల డేట్స్‌ ప్రకటించేశారు. ఇప్పుడు బాలయ్య కూడా వస్తే ద్విముఖ పోటీ కాస్త.. త్రిముఖ పోటీ అవుతుంది. మరి బాలయ్య పొంగల్‌ ఫైట్‌కి సరే అంటారా? లేక ఇబ్బందులేమీ లేకుండా డిసెంబరులో ‘అఖండ’ టైమ్‌కి వచ్చేస్తారా? అనేది చూడాలి.

దసరాకు సినిమా అనుకున్నప్పుడు కూడా చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’తో పోటీకి దిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వెళ్లినా మెగా వర్సెస్‌ నందమూరి తప్పదు. ఇక ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ అయితే భారీ స్థాయిలో రూపొందుతోంది. ఒకవేళ ఈ ముగ్గురూ పొంగల్‌ ఫైట్‌కి దిగితే.. అభిమానులకు పండగే. మూడుకు మూడు హిట్‌ అయితే బాక్సాఫీసుకి పండగే. సో వెయిటింగ్‌ ఫర్‌ 2023 జనవరి. మీరు కూడా ఇదే అంటారా?

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus