Balakrishna: బాలయ్య మూవీ విషయంలో అలా జరుగుతోందా?

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. అఖండ సక్సెస్ తో జోరుమీదున్న బాలకృష్ణ అదే ఉత్సాహంతో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. సిరిసిల్లలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోకాపేట్ లో జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఆచార్య సినిమా కోసం వేసిన సెట్ లో బాలయ్య మూవీ షూటింగ్ జరుగుతోందని సమాచారం అందుతోంది.

Click Here To Watch NOW

ఆచార్య మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైన సంగతి తెలిసిందే. మరో 4 వారాల్లో థియేటర్లలో ఆచార్య సినిమా రిలీజ్ కానుంది. చరణ్ కెరీర్ లోనే తొలిసారి తక్కువ గ్యాప్ లో చరణ్ హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ఆచార్య కొరకు కొరటాల స్పెషల్ గా వేయించిన సెట్ లో బాలయ్య మూవీ షూట్ జరుగుతోంది. బాలయ్య సినిమాకు సంబంధించి మేకర్స్ వేర్వేరు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తున్నారు.

బాలయ్య శృతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. గోపీచంద్ మలినేని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. క్రాక్ సినిమాను మించిన హిట్ గా ఈ సినిమాను నిలపాలని గోపీచంద్ భావిస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య తర్వాత సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమాపై కూడా భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus