Balayya Babu: స్టార్ ప్రొడ్యూసర్ బాలయ్యతో సినిమా నిర్మించనున్నారా?

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపావళి పండుగ రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ సీజన్2 ప్రోమోకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ప్రశాంత్ వర్మకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.

ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం హను మాన్ సినిమాతో ఈ దర్శకుడు బిజీగా ఉన్నారు. వరుసగా స్టార్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ ఈ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలయ్య ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

బాలయ్య సినిమా అంటే తక్కువ వర్కింగ్ డేస్ లోనే పూర్తవుతుందనే సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అఖండ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో బాలయ్య తర్వాత సినిమాలకు కూడా బాగానే బిజినెస్ జరుగుతోంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus